Telugu Global
Cinema & Entertainment

Hanu-Man | బాలీవుడ్ లో హనుమాన్ హంగామా

Hanu-Man - హనుమాన్ సినిమా డ్రీమ్ రన్ కొనసాగుతోంది. ఈ వీకెండ్ కూడా ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది.

Hanu-Man | బాలీవుడ్ లో హనుమాన్ హంగామా
X

హనుమాన్ సినిమా ఇలా వచ్చి అలా వెళ్లిపోయేది కాదని, చాన్నాళ్ల పాటు థియేటర్లలో కొనసాగుతుందని రిలీజ్ కు ముందు నుంచి మేకర్స్ చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు అదే నిజమైంది. హనుమాన్ సినిమా రోజురోజుకు తన పరిధిని పెంచుకుంటూ పోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు రెండో వారం మరిన్ని థియేటర్లు యాడ్ అయ్యాయి.

అటు ఉత్తరాదిన హను-మాన్ హవా కొనసాగుతోంది. ఓవైపు రామ మందిరం ప్రారంభోత్సవం కూడా ఉండడంతో, హనుమాన్ సినిమా చూసేందుకు నార్త్ ప్రేక్షకులు ఎగబడుతున్నారు. ఫలితంగా శని, ఆదివారాలు ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. పనిలోపనిగా సినిమాకు నార్త్ లో మరిన్ని థియేటర్లు కేటాయిస్తున్నారు

బాలీవుడ్ లో హనుమాన్ సినిమాకు శనివారం 4 కోట్ల రూపాయలు, ఆదివారం 4 కోట్ల 20 లక్షల రూపాయల నెట్ వచ్చింది. తాజా వసూళ్లతో ఈ సినిమాకు ఉత్తరాదిన 30 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చినట్టయింది. ఓ చిన్న సినిమాకు ఇది చాలా పెద్ద విజయం.

ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా డ్రీమ్ రన్ కొనసాగుతోంది. అటు ఓవర్సీస్ లో ఇప్పటికే ఆల్ టైమ్ టాప్-5 గ్రాసర్స్ లిస్ట్ లోకి చేరింది హనుమాన్. 5 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతోంది. బాహుబలి-2, ఆర్ఆర్ఆర్, సలార్, బాహుబలి-1 సినిమాల తర్వాత హను-మాన్ సినిమా 5వ స్థానంలో కొనసాగుతోంది.

First Published:  21 Jan 2024 5:42 PM GMT
Next Story