Telugu Global
Cinema & Entertainment

Teja Sajja | చిరంజీవి కోసం తేజ సజ్జా డాన్స్ పెర్ఫార్మెన్స్

Teja Sajja - మెగాస్టార్ చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ యంగ్ హీరో తేజ సజ్జా డాన్స్ పెర్ఫామెన్స్‌ ఇవ్వబోతున్నాడు.

Teja Sajja | చిరంజీవి కోసం తేజ సజ్జా డాన్స్ పెర్ఫార్మెన్స్
X

హైదరాబాద్‌లో జరగనున్న సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ తొలి వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరు కాబోతున్న సంగతి తెలిసిందే. దీంతో మెగాభిమానులు, సినీ ప్రేమికులు, ప్రేక్షకులు ఈ ఉత్సవం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ యంగ్ హీరో తేజ సజ్జా డాన్స్ పెర్ఫామెన్స్‌ ఇవ్వబోతున్నాడు.

ఈ సినీ ఉత్సవం రేపు (మార్చి 22) నోవాటెల్ హోటల్‌లో జరగనుంది. తేజ సజ్జా డాన్స్ పెర్ఫామెన్స్ ఈవెంట్‌లో హైలైట్‌ కానుంది.

చిరంజీవి నటించిన కొన్ని సినిమాల్లో తేజ సజ్జా బాలనుటుడిగా కనిపించాడు. మరీ ముఖ్యంగా ఇంద్ర సినిమాలో తేజ సజ్జా పెర్ఫార్మెన్స్ అందరికీ నచ్చింది. చిరంజీవి లేకపోతే తను లేను అనే తేజ సజ్జా.. ఇప్పుడు ఆయన కోసం స్టేజ్ పై డాన్స్ చేస్తున్నాడు.

రీసెంట్ గా తేజ సజ్జ నటించిన హనుమాన్ సినిమా థియేటర్లలోకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఈ సినిమాను కూడా చిరంజీవి తన భుజానికెత్తుకొని ప్రచారం చేశారు. ఇప్పుడా కృతజ్ఞతను తేజ సజ్జా చూపించబోతున్నాడు.

చిరంజీవిపై ప్రేమాభిమానాలను వ్యక్తం చేస్తూ చేస్తూ అంకితమిచ్చే ఈ డాన్స్ పెర్ఫామెన్స్ చిరంజీవి సినీ ఇండస్ట్రీపై చూపిన ప్రభావం, కలిగించిన స్ఫూర్తిని తెలియజేసేదిగా ఉంటుంది.

First Published:  21 March 2024 4:17 AM GMT
Next Story