Telugu Global
Cinema & Entertainment

Hanu-Man | ప్రేక్షకుల విజయం అంటున్న హీరో

Hanu-Man Movie - అంతా ఊహించినట్టుగానే హను-మాన్ సినిమా సక్సెస్ అయింది. ఈ సినిమా సక్సెస్ పై తొలిసారి స్పందించాడు హీరో తేజ సజ్జా.

Hanu-Man | ప్రేక్షకుల విజయం అంటున్న హీరో
X

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ 'హను-మాన్'. యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తోంది. అంతేకాదు, సంక్రాంతి విజేతగా కూడా నిలిచింది. ఈ సందర్భంగా హీరో తేజ సజ్జా మీడియాతో మాట్లాడాడు.

"చాలా ఆనందంగా ఉంది. అన్నిచోట్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. బయట భాషల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇతర భాషల వారికి నేనెవరో కూడా తెలీదు. ఇలాంటి వారి నుంచి వస్తున్న గొప్ప స్పందన చాలా సంతోషాన్ని ఇస్తోంది. హనుమాన్ నా కెరీర్ లో బెంచ్ మార్క్ చిత్రంగా నిలిచిపోతుంది. ఈ విజయం ప్రేక్షకులందరిది. ఏదో దైవశక్తి మమ్మల్ని నడుపుతుందని బలంగా నమ్ముతున్నాను."

ఇలా హనుమాన్ సక్సెస్ పై తొలిసారి స్పందించాడు హీరో తేజ సజ్జా. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, హీరో అక్క పాత్రలో కనిపించింది. సినిమాలో హనుమంతుడిపై వచ్చిన సన్నివేశాలను ప్రేక్షకులు బాగా ఆస్వాదిస్తున్నారు.

First Published:  13 Jan 2024 5:14 PM GMT
Next Story