Telugu Global
Cinema & Entertainment

Teja Sajja | నటుడిగా పాతికేళ్లు పూర్తి చేసుకున్న తేజ సజ్జా

Teja Sajja - 'చూడాలని ఉంది' సినిమా పాతికేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమాతోనే నటుడిగా మారాడు తేజ సజ్జ.

Teja Sajja | నటుడిగా పాతికేళ్లు పూర్తి చేసుకున్న తేజ సజ్జా
X

తెలుగు చలన చిత్ర పైరిశ్రమ లో 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి బ్లాక్‌బస్టర్ ‘చూడాలని ఉంది’ మేకర్స్ కు కృతజ్ఞతలు తెలిపిన హీరో తేజ సజ్జ.

చిరంజీవి హీరోగా గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘చూడాలని ఉంది’. అశ్వనీదత్‌ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టించింది. ఈ చిత్రంతోనే బాలనటుడిగా అరంగేట్రం చేశాడు హీరో తేజ సజ్జ. ఈ సినిమా విడుదలై నేటితో 25 ఏళ్లు పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు గుణశేఖర్, నిర్మాత అశ్వినీదత్ కు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపాడు తేజ.

"25 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజు. ఏx జరుగుతుందనే అవగాహన లేకుండా పరిశ్రమలో అడుగు పెట్టాను. నా జీవితం మారిపోయింది. లెజెండ్‌తో వెండితెరపై నా మొదటి పెర్ఫార్మెన్స్ మొదలైంది. ఇప్పుడు హనుమాన్ కోసం ఎదురుచూస్తున్నాను. ఇదంతా ఓ కలలా అనిపిస్తోంది."

ఇలా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు తేజ సజ్జ. తన సినిమా కల చిరంజీవి, అశ్వనీదత్, గుణశేఖర్ తో ప్రాణం పోసుకుందని... వాళ్లకు జీవితాంతం కృతజ్ఞతగా ఉంటానని అన్నాడు.

First Published:  27 Aug 2023 2:44 PM GMT
Next Story