Telugu Global
Cinema & Entertainment

Hanu-Man: అయోధ్యలో హనుమాన్ టీమ్

Hanu-Man: హనుమాన్ యూనిట్ అయోధ్యలో రామాలయాన్ని సందర్శించింది. రాముడ్ని దర్శించుకొని, అధికారికంగా ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు.

Hanu-Man: అయోధ్యలో హనుమాన్ టీమ్
X

తేజ సజ్జ హీరోగా నటిస్తున్న సినిమా హను-మాన్. ప్రశాంత్ వర్మ దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ క్రేజీ పాన్ ఇండియా సినిమా టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. హను-మాన్‌ టీజర్ కు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.

ఈ నేపథ్యంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ , హీరో తేజ సజ్జాతో సహా హను-మాన్ టీమ్ శ్రీరాముని ఆశీర్వాదం కోసం అయోధ్య ఆలయాన్ని సందర్శించింది. టీజర్‌ కి వచ్చిన రెస్పాన్స్‌తో ఆనందంలో ఉన్న టీమ్, అయోధ్యను సందర్శించిన ప్రమోషనల్ క్యాంపెయిన్‌ ను ప్రారంభించనుంది.

అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ క్రేజీ పాన్ ఇండియా చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌ టైన్‌ మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌లను అందిస్తున్నారు.

హను-మాన్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మేకర్స్ త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తారు.

First Published:  1 Dec 2022 3:54 AM GMT
Next Story