Telugu Global
Cinema & Entertainment

S5 Movie: డిఫరెంట్ కాన్సెప్ట్ తో హారర్ మూవీ

TarakaRatna's S5 Movie: తారకరత్న హీరోగా నటిస్తున్న సినిమా S5. తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. దీని కోసం నందిత శ్వేతను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు.

S5 Movie: డిఫరెంట్ కాన్సెప్ట్ తో హారర్ మూవీ
X

తారకరత్న, ప్రిన్స్, సునీల్, అలీ, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ఎస్ 5 - నో ఎగ్జిట్. సన్నీ కోమలపాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. శౌరీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఆదూరి ప్రతాప్ రెడ్డి నిర్మిస్తున్నారు.

హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 30న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదల చేశారు. అవినాష్ కాలేజ్ విద్యార్థుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈవెంట్ కు హీరోయిన్ నందితా శ్వేత ముఖ్య అతిథిగా హాజరైంది.

ఓ ట్రయిన్ లో ఎస్5 బోగీలో జరిగిన కథతో ఈ సినిమా తెరకెక్కింది. టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మణిశర్మ సంగీతం, గరుడ వేగ అంజి సినిమాటోగ్రఫీ ఆకట్టుకున్నాయి. ఒక ట్రైన్ బోగిలో జరిగిన హిలేరియస్ హారర్ జర్నీ ఇది.

ఇప్పటివరకు ట్రయిన్ హారర్ ఎలిమెంట్ అనేది రాలేదు. పైగా ఈ కాన్సెప్ట్ కు ఓ కొత్త టెక్నాలజీ యాడ్ చేసి ఈ సినిమాను తెరకెక్కించారు. సాయికుమార్, తారకరత్న పాత్రలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలు అంటున్నారు మేకర్స్.



First Published:  15 Dec 2022 7:30 AM GMT
Next Story