Telugu Global
Cinema & Entertainment

Tantraa movie | వెరైటీ వార్నింగ్ ఇచ్చిన 'తంత్ర' యూనిట్

Tantraa movie - తమ సినిమాకు విభిన్నంగా ప్రచారం చేస్తున్నారు తంత్ర యూనిట్ సభ్యులు. పిల్ల బచ్చాలు రావొద్దంటూ హెచ్చరిస్తున్నారు.

Tantraa movie | వెరైటీ వార్నింగ్ ఇచ్చిన తంత్ర యూనిట్
X

తమ సినిమాకి A-సర్టిఫికేట్ రావడంపై 'తంత్ర' టీమ్ డిఫరెంట్‌గా రియాక్ట్ అయ్యింది. మా సినిమాకి పిల్ల బచ్చాలు రావద్దని హెచ్చరిస్తూ 'A' ని పెద్దగా హైలైట్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. నిజానికి ఇదొక సరికొత్త క్రియేటివ్ ప్రమోషనల్ స్ట్రాటజీ.

అలానే తమ సినిమా మంచి హర్రర్ ఎలిమెంట్స్‌తో థ్రిల్ చేస్తుందని కాన్ఫిడెంట్‌గా ఉన్న మేకర్స్ తమ సినిమాకి చిన్నపిల్లలు రావద్దని వారిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన్ టీజర్, సాంగ్స్‌ని యూత్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

హీరోయిన్ అనన్య నాగళ్ల పల్లెటూరి అమ్మాయిగా, క్షుద్రపూజలకి గురైన బాధితురాలిగా టీజర్‌లో కనపడితే.. 'ధీరే ధీరే' సాంగ్‌లో అందమైన ప్రియురాలిగా కుర్రాళ్ల మనసుల్ని కొల్లగొడుతోంది. అనన్య నాగళ్లకి జోడీగా శ్రీహరి ఫ్యామిలీ నుంచి వచ్చిన ధనుష్ రఘుముద్రి మంచి స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నాడు.

వీరే కాకుండా మర్యాదరామన్న ఫేం సలోని, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్ ఈ హార్డ్‌హిట్టింగ్ హర్రర్ డ్రామాకి తమదైన మార్క్ జోడించారు. దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమౌతున్నాడు. ఆర్ ఆర్ ధృవన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తారు.

First Published:  24 Feb 2024 4:31 PM GMT
Next Story