Telugu Global
Cinema & Entertainment

Tantra Movie | టీజర్ తో భయపెట్టిన హారర్ మూవీ

Tantra Movie - టాలీవుడ్ తెరపైకి మరో హారర్ మూవీ రాబోతోంది. దీని పేరు తంత్ర. టీజర్ తో ఈ సినిమా బాగా ఎట్రాక్ట్ చేస్తోంది.

Tantra Movie | టీజర్ తో భయపెట్టిన హారర్ మూవీ
X

మల్లేశం, వకీల్‌సాబ్ సినిమాలతో ప్రేక్షకులని మెస్మరైజ్ చేసిన మన తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'తంత్ర'. ఈ మూవీ టీజర్ ను ప్రియదర్శి విడుదల చేశాడు.

‘ఊరిలో పుట్టిన దుష్ట శక్తి రక్తదాహంతో విరుచుకుపడుతోంది..’ అంటూ చెబుతున్న డైలాగ్స్ మీద కట్ అయిన టీజర్ రకరకాల తాంత్రిక పూజలని చూపిస్తూ మైండ్-బ్లోయింగ్‌గా ఉంది. టీజర్‌ని బట్టి ఈ సినిమాలో మన పురాతన తాంత్రిక రహస్యాలని వెలికితీస్తున్నట్టు తెలుస్తోంది. అనన్య దుష్టశక్తి బారిన పడిన అమ్మాయిగా కొత్తగా కనిపిస్తోంది. అనన్య ఇంతవరకు చెయ్యని ఒక క్రేజీ రోల్ చేస్తోందని మేకర్స్ చెబుతున్నారు. క్షుద్రపూజలు చేసే తాంత్రికుడిగా 'టెంపర్ వంశీ' లుక్ బాగా సెట్ అయింది. సలోని పాత్ర మిస్టీరియస్‌గా కనబడుతోంది.

ప్రస్తుతం హర్రర్ ట్రెండ్ నడుస్తోంది. క్షుద్రపూజలు ఇతివృత్తంగా వస్తున్న సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్స్ కొడుతున్నాయి. తాజాగా వచ్చిన పొలిమేర-2 దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ టైమ్‌లో వస్తున్న తంత్ర కూడా ప్రామిసింగ్‌గా కనపడుతోంది. శ్రీహరి తమ్ముడి కొడుకు ధనుష్ రఘుముద్రి ఈ మూవీతో హీరోగా పరిచయమవుతున్నాడు. సలోని ఈ సినిమాతో రీ-ఎంట్రీ ఇస్తోంది. రీసెంట్‌గా మంగళవారం సినిమాతో ఆకట్టుకున్న మీసాల లక్ష్మణ్ ఈ సినిమాలో ఒక మంచి రోల్ చేశాడు.

ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్ బ్యానర్స్ కలిసి రూపొందించిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. వాల్ట్‌డిస్నీలో పనిచేసిన శ్రీనివాస్ గోపిశెట్టి ఈ మూవీతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు.

First Published:  9 Dec 2023 3:25 PM GMT
Next Story