Telugu Global
Cinema & Entertainment

రాముడి గెటప్ మార్చడమేంటి? 'ఆదిపురుష్‌'పై త‌మ్మారెడ్డి భరద్వాజ విమర్శలు

చిత్ర బృందం మాత్రం ఈ సినిమాను 3డీలో చూస్తే వేరుగా ఉంటుందని చెబుతోంది. 3డీలో చూసినా, 4డీలో చూసినా, 2డీలో చూసినా యానిమేషన్ కి, లైవ్ కి చాలా తేడా ఉంటుంది. 2డీ నుంచి 3డీలోకి వెళ్ళినంత మాత్రాన వేసుకున్న గెటప్ లు, దుస్తులు మారవు.

రాముడి గెటప్ మార్చడమేంటి? ఆదిపురుష్‌పై త‌మ్మారెడ్డి భరద్వాజ విమర్శలు
X

ఇటీవల కాలంలో ఏ సినిమాకు రానన్ని విమర్శలు ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్‌కు వచ్చాయి. శ్రీరాముడు, రావణుడు, ఆంజనేయస్వామి ఆహార్యాన్ని మార్చడంపై సోషల్ మీడియా వేదికగా భారీగా ట్రోల్స్ వస్తున్నాయి. ఆదిపురుష్ యానిమేటేడ్ మూవీలా ఉందని నెటిజన్లు విమర్శలు చేశారు. దీనిపై దర్శకుడు ఓం రౌత్ వివరణ ఇచ్చాడు. యూట్యూబ్ లో చూసి దీనిపై విమర్శలు చేయవద్దని, ఈ సినిమా 3డీ చిత్రమని థియేటర్లో చూస్తే నచ్చుతుందని వివరించాడు.

తాజాగా ఆదిపురుష్ టీజర్ పై దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 'ఆదిపురుష్ టీజర్ చూశా. రూ.500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ నిరాశపరిచింది. ఇది యానిమేటెడ్ మూవీ లాగా ఉంది. ఈ మూవీ రజినీకాంత్ హీరోగా నటించిన కొచ్చాడయాన్ లా యానిమేటెడ్ చిత్రంలా తీసినట్లు విమర్శలు వస్తున్నాయి.

చిత్ర బృందం మాత్రం ఈ సినిమాను 3డీలో చూస్తే వేరుగా ఉంటుందని చెబుతోంది. 3డీలో చూసినా, 4డీలో చూసినా, 2డీలో చూసినా యానిమేషన్ కి, లైవ్ కి చాలా తేడా ఉంటుంది. 2డీ నుంచి 3డీలోకి వెళ్ళినంత మాత్రాన వేసుకున్న గెటప్ లు, దుస్తులు మారవు.

ఈ సినిమాలో ప్రభాస్ ను చూస్తుంటే యానిమేటెడ్ రాముడిలా కనిపిస్తున్నాడు. రాముడిని దేవుడిగా కొలిచే దేశంలో ఆయన గెటప్ ను మార్చేయడం పెద్ద విచిత్రం. రావణుడికి కూడా మనదేశంలో ఆలయాలు ఉన్నాయి. ఈ సినిమాకు ప్రస్తుతం రిపేర్లు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఆ రిపేర్ల తర్వాత అయినా సినిమా మంచిగా రావాలని కోరుకుంటున్నా. ఈ సినిమాను అల్లరి చేయాలనే ఉద్దేశం నాకు లేదు. ఆదిపురుష్ సినిమాకు ఆల్ ది బెస్ట్' అని తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్స్ చేశారు. ఆదిపురుష్ సినిమాపై తమ్మారెడ్డి భరద్వాజ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా సంచలనంగా మారాయి.

First Published:  9 Oct 2022 1:30 PM GMT
Next Story