Telugu Global
Cinema & Entertainment

Tamanna - తనపై వచ్చిన పుకార్లు ఖండించిన మిల్కీ బ్యూటీ

Tamanna - తనపై వచ్చిన పుకార్లను ఖండించింది తమన్న. అనీల్ రావిపూడి, బాలయ్య అంటే తనకు చాలా గౌరవం అని ప్రకటించింది.

Tamanna - తనపై వచ్చిన పుకార్లు ఖండించిన మిల్కీ బ్యూటీ
X

తమన్నకు స్పెషల్ సాంగ్స్ కొత్తకాదు. మరీ ముఖ్యంగా అనీల్ రావిపూడి సినిమాల్లో నటించడం అంతకంటే కొత్తకాదు. గతంలో అనీల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఐటెంసాంగ్ చేసింది ఈ బ్యూటీ. ఇప్పుడు మరోసారి అలాంటి పుకార్లు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం బాలయ్య హీరోగా అనీల్ రావిపూడి ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో బాలయ్య సరసన హీరోయిన్ గా కాజల్ నటిస్తోంది. బాలయ్యకు కూతురు వరస పాత్రలో శ్రీలల నటిస్తోంది. ఈ సినిమాలో తమన్నతో ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారంటూ పుకార్లు మొదలయ్యాయి.

ఇంతవరకు ఓకే. తమన్నపై ఇలాంటి పుకార్లు రావడం సహజమే. అయితే అసలు చిక్కు ఇక్కడే మొదలైంది. ఈ స్పెషల్ సాంగ్ లో డాన్స్ చేసేందుకు తమన్న భారీగా డిమాండ్ చేసిందని, దీంతో మేకర్స్ ఇబ్బంది పడ్డారంటూ వార్తలొచ్చాయి.

ఇలా పుకార్లు వచ్చిన వెంటనే తమన్న రియాక్ట్ అయింది. బాలయ్య సినిమాలో తను ఐటెంసాంగ్ చేయడం లేదని స్పష్టం చేసింది. అనీల్ రావిపూడి, బాలయ్యపై తనకు అపారమైన గౌరవం ఉందని, ఇలా తనపై ఇష్టమొచ్చినట్టు ఊహాగానాలు రాయొద్దని మీడియాను కోరింది ఈ చిన్నది.

ప్రస్తుతం చిరంజీవి సరసన భోళాశంకర్ సినిమా చేస్తోంది తమన్న. సైరా తర్వాత చిరంజీవితో కలిసి తమన్న చేస్తున్న మూవీ ఇదే. ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకుంది మిల్కీబ్యూటీ.

First Published:  21 May 2023 5:13 AM GMT
Next Story