Telugu Global
Cinema & Entertainment

స్వాతిముత్యం.. టీజర్ ట్రయిలర్ రిలీజైంది

ఓ సినిమాకు టీజర్ ఉంటుంది, లేదంటే ట్రయిలర్ ఉంటుంది. కానీ స్వాతిముత్యం సినిమాకు టీజర్-ట్రయిలర్ అంటూ కొత్త వీడియో రిలీజ్ చేశారు. ఆ మేటర్ ఏంటో మీరే చూసేయండి..

స్వాతిముత్యం.. టీజర్ ట్రయిలర్ రిలీజైంది
X

ఓ సినిమాకు ముందుగా టీజర్ రిలీజ్ చేస్తారు, ఆ తర్వాత ట్రయిలర్ లాంచ్ చేస్తారు. స్వాతిముత్యం సినిమాకు కూడా టీజర్ ఆల్రెడీ రిలీజ్ చేశారు. ట్రయిలర్ రిలీజ్ కు ఇంకా టైమ్ ఉంది. కానీ ఇంతలోనే మరో వీడియో రిలీజ్ చేయాల్సి వచ్చింది. మరి దీనికి ఏం పేరు పెడితే బాగుంటుంది. అందుకే ఇటు టీజర్ కాకుండా, అటు ట్రయిలర్ అని చెప్పకుండా.. టీజర్-ట్రయిలర్ పేరిట ఓ వీడియో విడుదల చేశారు.

టీజర్-ట్రయిలర్ అనే పేరుకు తగ్గట్టే ఇందులో టీజర్ లోని కొన్ని విజువల్స్, త్వరలోనే విడుదలకానున్న ట్రయిలర్ లోని కొన్ని సన్నివేశారతో ఈ వీడియో కట్ చేశారు. ఇంతకీ ఉన్నఫలంగా ఇప్పుడీ వీడియో ఎందుకు రిలీజ్ చేశారో తెలుసా? ఇందులో హీరో బెల్లకొండ గణేశ్. అతడి పుట్టినరోజు సందర్భంగా ఈ టీజర్-ట్రయిలర్ ను లాంఛ్ చేశారు.

ఇక ఈ వీడియో విషయానికొస్తే.. హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సున్నితమైన సంభాషణలు మెప్పిస్తున్నాయి. రావురమేష్, వెన్నెలకిషార్ లు కూడా ఇందులో కనిపించారు. చిత్రం థియేట్రికల్ ట్రైలర్ త్వరలోనే విడుదల చేస్తామనే ప్రకటనతో పాటు, దసరా శుభాకాంక్షలతో ప్రేక్షకుల ముందుకు "స్వాతిముత్యం" ను అక్టోబర్ 5 న విడుదల చేస్తున్నట్లు ఈ వీడియోలో ప్రకటించడాన్ని గమనించవచ్చు.



First Published:  14 Sep 2022 3:10 PM GMT
Next Story