Telugu Global
Cinema & Entertainment

వాయిదాపడిన స్వాతిముత్యం

బెల్లంకొండ గణేశ్, వర్ష బొల్లమ్మ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా స్వాతిముత్యం. ఈ సినిమా విడుదల వాయిదా పడింది.

వాయిదాపడిన స్వాతిముత్యం
X

గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన సినిమా 'స్వాతిముత్యం'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్ట్ 13న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడీ సినిమా వాయిదాపడింది. కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నామని సితార ఎంటర్ టైన్ మెంట్స్ ప్రకటించింది.

ఈ నిర్ణయం పట్ల ఏమాత్రం సంతోషంగా లేమని ప్రకటించిన నిర్మాణ సంస్థ.. వాయిదా వేయక తప్పడం లేదంటోంది. రిలీజ్ డేట్‌ని దృష్టిలో పెట్టుకుని షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి, రిలీజ్ ప్లాన్‌తో ముందుకు వెళ్లాలనుకున్నప్పటికీ... ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదా నిర్ణయం తీసుకోక తప్పలేదంటున్నారు.

"మహమ్మారి కరోన తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ పరిస్థితి అంత గొప్పగా లేదు. ఇంతకుముందులా ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. మా సినిమా విడుదలకు సరైన సమయం కుదిరినప్పటికీ, ప్రస్తుతం పరిస్థితి చూసి,ఇతర చిత్రాల నిర్మాతల పరిస్థితి చూసి మా సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాం. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం. ప్రేక్షకులు థియేటర్‌లకు వచ్చి మునుపటిలాగ సినిమాలను ఆదరిస్తారనే నమ్మకం కుదిరిన రోజున మా సినిమాను విడుదల చేస్తాం." అంటూ నిర్మాతలు ప్రకటించారు.

గణేష్ ,వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలోని ఇతరపాత్రల్లో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, సప్తగిరి, నటిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు లక్ష్మణ్ కృష్ణ దర్శకుడు.





First Published:  4 Aug 2022 7:00 AM GMT
Next Story