Telugu Global
Cinema & Entertainment

స్వాతిముత్యం.. అప్పుడే ఓటీటీలోకి!

దసరా కానుకగా థియేటర్లలోకి వచ్చింది స్వాతిముత్యం. నెల రోజులు తిరక్కముందే, దీపావళి కానుకగా ఓటీటీలో ప్రత్యక్షం కాబోతోంది.

స్వాతిముత్యం.. అప్పుడే ఓటీటీలోకి!
X

నిన్నగాకమొన్ననే థియేటర్లలోకి వచ్చింది స్వాతిముత్యం సినిమా. బెల్లంకొండ గణేశ్ ను హీరోగా పరిచయం చేసిన ఈ మూవీ, అంతలోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఇంకా చెప్పాలంటే, ఇదే నెలలో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, ఇదే నెలలో ఓటీటీలోకి కూడా వచ్చేస్తోంది.

దసరా కానుకగా థియేటర్లలోకి వచ్చింది స్వాతిముత్యం. సినిమాకు మంచి టాక్ కూడా వచ్చింది. అయితే ఈ మూవీతో పాటు వచ్చిన గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ సినిమాల ముందు గణేశ్ నటించిన చిన్న సినిమా నిలబడలేకపోయింది. అలా హిట్ టాక్ వచ్చినా, కలెక్షన్లు లేక చతికిలపడిన ఈ సినిమాను, ఆహా యాప్ కు ఇచ్చేశారు.

దీపావళి కానుకగా ఈనెల 28న ఆహా యాప్ లో స్వాతిముత్యం సినిమాను స్ట్రీమింగ్ కు పెట్టబోతున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాతో లక్ష్మణ్ దర్శకుడిగా పరిచయమయ్యాడు.

ఈ సినిమాతో గణేశ్ బెల్లంకొండ బెస్ట్ డెబ్యూ ఇచ్చాడు. ఇతడి సరసన వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించింది. మహతి స్వరసాగర్ సంగీతం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సరోగసీ కాన్సెప్ట్ ను ఈ సినిమాలో టచ్ చేశారు.

First Published:  19 Oct 2022 4:26 AM GMT
Next Story