Telugu Global
Cinema & Entertainment

స్వాతిముత్యం ట్రయిలర్ రివ్యూ

బెల్లంకొండ గణేశ్ హీరోగా పరిచయమౌతున్న సినిమా స్వాతిముత్యం. వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించింది. తాజాగా ఈ సినిమా ట్రయిలర్ ను లాంచ్ చేశారు. అదెలా ఉందో చూద్దాం..

స్వాతిముత్యం ట్రయిలర్ రివ్యూ
X

బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయమౌతున్న సినిమా స్వాతిముత్యం. 'సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ఇది. వర్ష బొల్లమ్మ హీరోయిన్. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ కుటుంబ కథాచిత్రం విజయ దశమి కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మూవీ ట్రయిలర్ ను తాజాగా విడుదల చేశారు. హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో గ్రాండ్ గా రిలీజైన ఈ ట్రయిలర్ సహజత్వంతో కూడిన సున్నితమైన వినోదాన్ని పంచేలా ఉంది.

"నిన్న నైట్ ఒక మూవీ చూశానండీ.. దాంట్లో కూడా హీరో, హీరోయిన్ మనలాగే కాఫీ షాప్ లో కలుస్తారు" అంటూ వర్ష బొల్లమ్మ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ఆహ్లాదకరంగా ప్రారంభమైంది. వర్షతో తొలి చూపులోనే గణేష్ ప్రేమలో పడటం, ఆమె కూడా గణేష్ ని తిరిగి ప్రేమించడం వంటి క్యూట్ సన్నివేశాలతో ట్రైలర్ సాగుతుండగా వారికి ఊహించని సమస్య ఎదురౌతుంది.

కాసేపట్లో పెళ్లి, ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి.. ఆ సమయంలో వారికి వచ్చిన సమస్య ఏంటి? దాని నుండి బయట పడటానికి ఏం చేశారు? వంటి సన్నివేశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. సహజమైన సన్నివేశాలు, సంభాషణలతో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ట్రయిలర్ లో మహతి స్వరసాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సూర్య సినిమాటోగ్రఫీ బాగున్నాయి.

దాదాపు అన్ని పాత్రల్ని ట్రయిలర్ లో పరిచయం చేశారు. హీరోకు ఎదురైన ఆ సమస్య ఏంటనేది మాత్రం ట్రయిలర్ లో సస్పెన్స్ లో పెట్టారు.



First Published:  27 Sep 2022 4:17 AM GMT
Next Story