Telugu Global
Cinema & Entertainment

SWAG Movie Teaser | మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తోంది.. కానీ అర్థంకాలే!

SWAG Movie - శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న సినిమా శ్వాగ్. ఈ మూవీ నుంచి టీజర్ రిలీజైంది. గమ్మత్తుగా ఉంది.

SWAG Movie Teaser | మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తోంది.. కానీ అర్థంకాలే!
X

శ్వాగ్ సినిమా టీజర్ చూసిన తర్వాత కలిగిన ఫీలింగ్ ఇది. టీజర్ నిజంగా క్రేజీగా ఉంది. మహిళలు ఆధిపత్యం చలాయించే ఓ రాజ్యంలో కథ మొదలవుతుంది. మగాడ్ని తొక్కేసే ఆ రాజ్యానికి మహారాణిలా రీతూ వర్మను పరిచయం చేశారు.

అక్కడివరకు బాగానే ఉంది. ఆ తర్వాత టీజర్ రకరకాల మలుపులు తిరిగింది. రకరకాల గెటప్స్ లో శ్రీవిష్ణు ఎంట్రీ, అతడి డైలాగ్స్.. మధ్యలో వచ్చే సునీల్, రవిబాబు.. ఇవి కాకుండా ఏ కాలానికి చెందిన కథో అర్థం కాకుండా వచ్చే కట్స్.. ఇలా శ్వాగ్ టీజర్ పిచ్చెక్కిచ్చింది.

దర్శకుడు హసిత్ గోలి ఓ ప్రత్యేకమైన కథతో వచ్చి, అసాధారణమైన రీతిలో సినిమాను తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. వివేక్ సాగర్ సంగీతం ఈ టీజర్ కు అదనపు అందాన్ని తెచ్చిపెట్టింది.

ఇక శ్రీవిష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. డిఫరెంట్ గెటప్స్ లో అతడు అలరించాడు. రాజుగా, కోయదొర సింగగా, అన్నింటికీ మించి భవభూతి పాత్రలో మెప్పించాడు. రీతూ వర్మతో పాటు, మీరా జాస్మిన్, దక్ష నగార్కర్ కు కూడా టీజర్ లో చోటు దక్కింది.

టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా, టీజర్ తో ఆసక్తి రేకెత్తించింది. ఇంతకుముందు పీపుల్ మీడియా, హసిత్ గోలి, శ్రీవిష్ణు కాంబోలో రాజరాజ చోర సినిమా వచ్చింది.

First Published:  30 Aug 2024 4:48 PM GMT
Next Story