Telugu Global
Cinema & Entertainment

సూపర్ హిట్ బ్యానర్ నుంచి మరో సినిమా

మళ్లీ రావా, ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ లాంటి హిట్ సినిమాలు తీసిన నిర్మాత, తన కొత్త సినిమాతో రెడీ అయ్యాడు. పేరు మసూద.

సూపర్ హిట్ బ్యానర్ నుంచి మరో సినిమా
X

'మ‌ళ్లీ రావా', 'ఏజెంట్ సాయిశ్రీ‌నివాస ఆత్రేయ' చిత్రాలతో సక్సెస్‌ఫుల్ బ్యానర్‌గా పేరు తెచ్చుకున్న స్వధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లో రాబోతోన్న మూడో చిత్రం 'మ‌సూద‌'. కంటెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఈ బ్యానర్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే విడుదలైన టైటిల్ లుక్ పోస్టర్ ట్రైమండస్ రెస్పాన్స్‌ని సొంతం చేసుకోగా.. ఇప్పుడు చిత్ర టీజర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఆగస్ట్ 2న ఈ చిత్ర టీజర్‌ విడుదల కాబోతోంది. తొలి రెండు సినిమాలతో గౌతమ్ తిన్ననూరి, స్వరూప్‌లను టాలీవుడ్ కు పరిచయం చేసిన నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా.. హర్రర్ డ్రామా జోనర్‌లో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంతో సాయికిరణ్ అనే మరో డైరెక్టర్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు.

హీరోగా 'జార్జిరెడ్డి' ఫేమ్ తిరువీర్ (ల‌ల్లన్ సింగ్ పాత్రధారి) న‌టిస్తుండగా.. 'గంగోత్రి' చిత్రంలో బాల‌న‌టిగా అల‌రించిన కావ్య క‌ల్యాణ్‌రామ్ ఈ చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మ‌వుతోంది. సీనియర్ నటి సంగీత కీలక పాత్రలో కనిపించనుంది. ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాల్ని, టీజర్ రిలీజ్ రోజు వెల్లడించబోతున్నారు.





First Published:  31 July 2022 10:18 AM GMT
Next Story