Telugu Global
Cinema & Entertainment

Sushanth - రావణాసుర సినిమా చేయడానికి కారణం అదే!

Sushanth - సుశాంత్, రావణాసుర సినిమా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? అతడేం చెబుతున్నాడు?

Sushanth - రావణాసుర సినిమా చేయడానికి కారణం అదే!
X

అల వైకుంఠపురములో సినిమాతో స్పెషల్ రోల్స్ కు ఓకే చెప్పడం మొదలుపెట్టాడు సుశాంత్. ఓవైపు సోలో హీరోగా సినిమాలు చేస్తూనే, మరోవైపు ఇలా స్పెషల్ రోల్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలో రావణాసుర సినిమాలో రామ్ అనే కీలక పాత్ర పోషించాడు ఈ అక్కినేని నటుడు. మరి ఈ సినిమా అంగీకరించడానికి కారణం ఏంటి?

"రావణాసుర సినిమా అంగీకరించడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. నేను ఫుల్ లెంగ్త్ థ్రిల్లర్ చేయలేదు. ఇచట వాహనములు నిలుపరాదు సినిమాలో కొంత థ్రిల్లర్ ఉంటుంది. కానీ కంప్లీట్ థ్రిల్లర్ మాత్రం రావణాసురనే. ఇందులో కొత్తగా కనిపించే అవకాశం వచ్చింది. ఈ సినిమా చేయడానికి కారణం అదే."

వెర్సటైల్ యాక్టర్ గా అన్ని రకాల పాత్రలు చేయాలనేది తన ఆలోచనగా చెప్పుకొచ్చిన సుశాంత్... రావణాసురలో ఆ కొత్తదనం కనిపించడంతో ఓకే చేశానన్నాడు. అల వైకుంఠపురములో సినిమా తర్వాత చాలా ఆఫర్లు వచ్చాయని, కానీ సెలక్టివ్ గా సినిమాలు చేస్తున్నానని వెల్లడించాడు.

ఈనెల 7న రిలీజ్ అవుతోంది రావణాసుర సినిమా. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాలో సుశాంత్ కీలక పాత్ర పోషించాడు. పూజిత పొన్నాడ పోలీస్ గా, ఫరియా అబ్దుల్లా లాయర్ గా నటించారు.

First Published:  4 April 2023 6:48 AM GMT
Next Story