Telugu Global
Cinema & Entertainment

Kanguva Trailer | సూర్య కంగువా ట్రయిలర్ ఎలా ఉందంటే?

Kanguva Trailer - సూర్య హీరోగా నటించిన సినిమా కంగువ. తాజాగా ఈ సినిమా ట్రయిలర్ లాంచ్ చేశారు.

Kanguva Trailer | సూర్య కంగువా ట్రయిలర్ ఎలా ఉందంటే?
X

“కంగువ” అనే పీరియాడికల్ డ్రామా నిర్మాణానికి సూర్య రెండేళ్లు కేటాయించాడు. శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎట్టకేలకు పూర్తయింది. ఇది ఎలా ఉందో, ఈరోజు రిలీజైన ట్రయిలర్ చెబుతోంది.

ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ట్రైలర్‌ అదిరింది. విజువల్స్ లావిష్ గా ఉన్నాయి. సెట్టింగ్ అద్భుతంగా ఉంది. యాక్షన్, గ్రాఫిక్స్, సెట్స్.. ఇలా అన్నీ సింక్ అయ్యాయి.

ఈ సినిమా కథ, అనేక సమస్యలతో కూడిన ఓ ద్వీపంలో నడుస్తుందని ట్రయిలర్ లో చెప్పారు. బానిసత్వం నుంచి విముక్తి కోసం సూర్య పోరాడుతున్నట్టు చూపించారు. బాబీ డియోల్ నిరంకుశ చక్రవర్తి పాత్ర పోషించాడు. హీరోయిన్ గా దిశా పటానీ నటించినప్పటికీ, ఆమెకు ట్రయిలర్ లో చోటు దక్కలేదు.

ఈ చిత్రానికి దర్శకుడు శివ. యువి క్రియేషన్స్‌తో కలిసి స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్ 10న తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో “కంగువ” థియేటర్లలోకి వస్తోంది.

First Published:  12 Aug 2024 5:16 PM GMT
Next Story