Telugu Global
Cinema & Entertainment

Kanguva movie release date | సూర్య సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్

Kanguva movie release date: సూర్య తాజా చిత్రం కంగువ. ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్నంటాయి. సోషియో ఫాంటసీ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాకు శివ దర్శకుడు కాగా.. దిశా పటానీ హీరోయిన్.

Kanguva movie release date | సూర్య సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్
X

Kanguva movie release date: సూర్య తాజా చిత్రం కంగువ. ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్నంటాయి. సోషియో ఫాంటసీ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాకు శివ దర్శకుడు కాగా.. యూవీ క్రియేషన్స్, స్టుడియో గ్రీన్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నాయి. యూవీ క్రియేషన్స్ కు ఇదే తొలి స్ట్రయిట్ తమిళ సినిమా కావడం విశేషం.

కంగువా సినిమాకు తాజాగా విడుదల తేదీ ఫిక్స్ చేశారు. కుదిరితే అక్టోబర్ చివరి వారంలో లేదా నవంబర్ 1న ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ వారంలో దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం యూనిట్ అంతా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అవి కొలిక్కి వచ్చిన వెంనేట రిలీజ్ డేట్ పై ఎనౌన్స్ మెంట్ ఉంటుంది.

ఈ సినిమాలో సూర్య సరసన దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ తాజా సెన్సేషన్ బాబీ డియోల్, ఈ సినిమాలో విలన్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం ఏకంగా 10వేల మందితో భారీ యుద్ధ సన్నివేశాన్ని తెరకెక్కించారు. ఈ ఎపిసోడ్, టోటల్ సినిమాకే హైలెట్ అవుతుందని భావిస్తున్నారు.

సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజైంది. గ్లింప్స్ కూడా సూపర్ హిట్టయింది. ఇదే ఊపులో సాంగ్స్ కూడా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

First Published:  19 May 2024 8:45 AM GMT
Next Story