Telugu Global
Cinema & Entertainment

Kanguva | 'కంగువ' సెకండ్ లుక్

Kanguva - సూర్య హీరోగా నటిస్తున్న చిత్రం కంగువ. ఈ సినిమా నుంచి సెకెండ్ లుక్ రిలీజ్ చేశారు.

Kanguva | కంగువ సెకండ్ లుక్
X

నేషనల్ అవార్డ్ విన్నర్, స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'కంగువ'. ఈ సినిమాను భారీ నిర్మాణ విలువలతో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోంది. చారిత్రక నేపథ్యంతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ శివ రూపొందిస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా మొత్తం 10 భాషల్లో తెరకెక్కుతున్న 'కంగువ' త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా 'కంగువ' సెకండ్ లుక్ రిలీజ్ చేశారు.

ఈ సెకండ్ లుక్ పోస్టర్ లో సూర్య యుద్ధవీరుడిగా కనిపించడంతో పాటు ట్రెండీ లుక్ క్యారెక్టర్ లోనూ సర్ ప్రైజ్ చేస్తున్నారు. 'విధి కాలం కంటే బలమైనది. గతం, వర్తమానం, భవిష్యత్ ...కాలం ఏదైనా నలుదిక్కులా మార్మోగే పేరు ఒక్కటే..కంగువ ' అంటూ సెకండ్ లుక్ సందర్భంగా మేకర్స్ క్యాప్షన్ ఇచ్చారు. సెకండ్ లుక్ ఇంట్రెస్టింగ్ గా ఉండి 'కంగువ'పై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది.

కెరీర్ స్టార్టింగ్ నుంచి విలక్షణమైన కథలు, పాత్రలు ఎంచుకుంటున్నాడు సూర్య. ఎప్పటికప్పుడు నటుడిగా నిరూపించుకుంటూనే, వైవిధ్యమైన పాత్రలతో తనకుతాను పరీక్ష పెట్టుకుంటున్నాడు. కంగువలో సూర్య రోల్ కూడా అలాంటిదే అంటున్నాడు డైరక్టర్ శివ. ఈ సినిమాతో సూర్య, ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.




First Published:  17 Jan 2024 4:03 PM GMT
Next Story