Telugu Global
Cinema & Entertainment

Surya Sudha Kongara | నేషనల్ అవార్డ్ విన్నింగ్ జోడీ మళ్లీ కలిసింది

Surya - ఆకాశం నీ హద్దురా సినిమా తర్వాత సుధా కొంగర దర్శకత్వంలో మరో సినిమా ఎనౌన్స్ చేశాడు సూర్య. ఇందులో మరో హీరో కూడా ఉన్నాడు.

Surya Sudha Kongara | నేషనల్ అవార్డ్ విన్నింగ్ జోడీ మళ్లీ కలిసింది
X

విమర్శకుల ప్రశంసలు పొందిన, నేషనల్ అవార్డు-విన్నింగ్ బ్లాక్‌బస్టర్ చిత్రం ఆకాశం నీ హద్దురా. ఈ సినిమాకు సుధా కొంగర దర్శకత్వం వహించారు. సూర్య హీరోగా నటించాడు. కరోనా కారణంగా అప్పట్లో నేరుగా ఓటీటీలో రిలీజైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఇప్పుడీ కాంబినేషన్ మరోసారి కలిసింది.

హీరో సూర్య తన కెరీర్ లో 43వ చిత్రాన్ని ప్రకటించాడు. దీనికి సుధా కొంగర దర్శకత్వం వహించబోతున్నారు. ఆకాశం నీ హద్దురా సినిమాకు సంగీతం అందించిన జీవీ ప్రకాశ్ కుమార్, ఈ సినిమాకు కూడా సంగీతం అందించబోతున్నాడు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ చిత్రం సంగీత దర్శకుడిగా జివి ప్రకాష్‌కి ఇది100వ చిత్రం.

ఈ సినిమా ఏకంగా 44 అవార్డులకు నామినేట్ అవ్వడంతో పాటు.. అందులోంచి 40 అవార్డుల్ని కొల్లగొట్టింది. వీటిలో 5 జాతీయ అవార్డులు కూడా ఉన్నాయి. సూర్యకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ తెచ్చిపెట్టింది ఈ సినిమా. ఇక తాజా కాంబినేషన్ విషయానికొస్తే.. ఈ సినిమాలో మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇది ఓ మల్టీస్టారర్ మూవీ. సినిమాలో సూర్యతో పాటు దుల్కర్ సల్మాన్ కూడా నటించబోతున్నాడు. అంతేకాదు, మూవీలో యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా నజ్రియాను తీసుకున్నారు. మరో కీలక పాత్ర కోసం విజయ్ వర్మను సెలక్ట్ చేశారు.

సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాకు రాజశేఖర్ కర్పూర సుందర పాండయన్ సహ-నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు.

First Published:  27 Oct 2023 5:41 PM GMT
Next Story