Telugu Global
Cinema & Entertainment

Surya | కంగువాలో నటించడం నా అదృష్టం

Kanguva Movie - కంగువా మూవీలో నటించడం తన అదృష్టం అంటున్నాడు హీరో సూర్య. ఇలాంటి సినిమాలో నటించడం ప్రతి నటుడికి ఓ డ్రీమ్ అన్నాడు.

Surya | కంగువాలో నటించడం నా అదృష్టం
X

కంగువ' లాంటి గొప్ప సినిమాలో నటించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నాడు స్టార్ హీరో సూర్య. ఆయన నటించిన ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీ త్వరలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. 'కంగువ' చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమాను స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. 10 భాషల్లో తెరకెక్కుతున్న 'కంగువ' త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు. తాజాగా ముంబైలో 'కంగువ' గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో సూర్యతో పాటు మూవీ టీమ్ పాల్గొన్నారు.

హీరో సూర్య మాట్లాడుతూ - "సినిమాకు స్క్రిప్ట్ కు మేకింగ్ కు మధ్య కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. కానీ కంగువ సినిమాకు ప్రతి రోజూ బెటర్ గా వర్క్ చేస్తూ వచ్చాం. ఒక కొత్త పాత్రలోకి మారిపోవడం ఎగ్జైటింగ్ గా ఉంటుంది. నటుడిగా పాతికేళ్ల అనుభవం తర్వాత ఒక సినిమాకు ఎగ్జైట్ అయి వర్క్ చేయడం అంత సులువు కాదు. కంగువకు 150 రోజులకు పైగా చేసిన షూట్ లో ప్రతి రోజూ ఆ ఎగ్జైట్ మెంట్ ఎక్సీపిరియన్స్ చేశాం. ఈ సినిమా మాకెంతో స్పెషల్" అన్నాడు.

First Published:  24 March 2024 9:56 AM GMT
Next Story