Telugu Global
Cinema & Entertainment

నిన్న షూటింగ్ మొదలు.. అప్పుడే సర్ ప్రైజ్

నిన్ననే సెట్స్ పైకొచ్చింది మహేష్-త్రివిక్రమ్ సినిమా. అప్పుడే ఈ మూవీకి సంబంధించి సర్ ప్రైజ్ లు ప్లాన్ చేస్తోంది యూనిట్.

త్రివిక్రమ్ సినిమా.. ఇంటి సెట్ ఉండాల్సిందే
X

త్రివిక్రమ్ సినిమా.. ఇంటి సెట్ ఉండాల్సిందే

లాంగ్ గ్యాప్ తర్వాత సెట్స్ పైకి వచ్చింది మహేష్-త్రివిక్రమ్ సినిమా. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే అభిమానుల ఆనందం కొన్ని రోజులు మాత్రమే అనే విషయం యూనిట్ కు తెలుసు. సెట్స్ పైకొచ్చిన మరుక్షణం అప్ డేట్స్ ఆశిస్తారనే విషయం ఇంకా బాగా తెలుసు. అందుకే యూనిట్ కూడా ఈ విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉంది.

మహేష్ ఇలా సెట్స్ పైకొచ్చిన వెంటనే ఫొటో రిలీజ్ చేసి ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపింది యూనిట్. ఆ వెంటనే కొన్ని గంటలకు ఏకంగా వీడియో రిలీజ్ చేసింది. ఇప్పుడు దానికి మించిన అప్ డేట్ ఇంకొకటి ఇచ్చింది. త్వరలోనే మహేష్-త్రివిక్రమ్ మూవీ నుంచి ఓ సర్ ప్రైజ్ రాబోతోంది.

అన్నీ అనుకున్నట్టు జరిగితే ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యేలోపు, మహేష్ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది యూనిట్. ఇలా మినిమం గ్యాప్స్ లో అప్ డేట్స్ ఇస్తూ, ప్రాజెక్టును పరుగులు పెట్టించాలని యూనిట్ భావిస్తోంది. సో.. ఇకపై మహేష్ మూవీకి సంబంధించి ఎప్పటికప్పుడు అఫీషియల్ అప్ డేట్స్ వస్తాయన్నమాట.

First Published:  13 Sep 2022 4:43 AM GMT
Next Story