Telugu Global
Cinema & Entertainment

రెండు పెద్ద సంస్థలు.. 2 సినిమాలు

టాలీవుడ్ లో రెండు పెద్ద సంస్థలైన సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ గ్రూప్ కలిశాయి. ఈ రెండు సంస్థలు కలిసి జాయింట్ గా 2 సినిమాలు నిర్మించబోతున్నాయి.

రెండు పెద్ద సంస్థలు.. 2 సినిమాలు
X

రెండు పెద్ద సంస్థలు. ఒకరేమో నిర్మాణ రంగంలో రారాజు. మరొకరు డిస్ట్రిబ్యూషన్ లో తోపు. ఇలాంటి రెండు ప్రముఖ సంస్థలు కలిస్తే అది కచ్చితంగా హాట్ టాపిక్ అవుతుంది. ఇది అలాంటి మేటరే.

సురేష్ ప్రొడక్షన్స్ గత కొన్ని దశాబ్దాలుగా ఫిల్మ్ మేకింగ్, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ బిజినెస్‌లో ఉంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద మల్టీప్లెక్స్ చైన్‌గా ఏషియన్ గ్రూప్ ఉంది. మరోవైపు హీరో రానా దగ్గుబాటి, తనకంటూ సొంతంగా స్పిరిట్ మీడియా పేరిట ఓ బ్యానర్ స్థాపించాడు.

ఇప్పుడీ 3 సంస్థలు కలిశాయి. సురేష్ బాబు, రానా దగ్గుబాటి, సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మాతలుగా త్వరలోనే 2 పెద్ద సినిమాలు రాబోతున్నాయి. ఈ మేరకు ఈ నిర్మాతలంతా కలిసి అధికారిక ప్రకటన చేశారు.

ప్రముఖ ప్రొడక్షన్ హౌస్‌ల నుంచి జాయింట్ వెంచర్లుగా వస్తున్న ఈ చిత్రాలకి సంబంధించిన కంటెంట్, ప్రొడక్షన్ వాల్యూస్ , టెక్నికాలిటీస్ అన్నీ సహజంగానే అత్యున్నతంగా ఉంటాయి.

అయితే ఇంతకుమించి వివరాల్ని వెల్లడించలేదు ఈ నిర్మాణ సంస్థలు. హీరోలు ఎవరు, దర్శకులు ఎవరనే విషయాల్ని త్వరలోనే మరో మంచి రోజు చూసి ప్రకటిస్తారు. ఈ రెండు సినిమాల్లో ఒక ప్రాజెక్టు హీరో నానితో ఉండే అవకాశం ఉంది.

First Published:  7 Oct 2022 2:54 AM GMT
Next Story