Telugu Global
Cinema & Entertainment

Super Star Krishna: నిలకడగా కృష్ణ ఆరోగ్యం

Super Star Krishna Health Condition: ఈ రోజు ఉదయం నుంచి నటుడు కృష్ణ ఆరోగ్య పరిస్థితి పై పుకార్లు వ్యాపించాయి. వీటిని కృష్ణ కుటుంబీకులు ఖండించారు

Super Star Krishna: నిలకడగా కృష్ణ ఆరోగ్యం
X

సూపర్ స్టార్ కృష్ణపై ఈరోజు ఉదయం నుంచి ఉన్నట్టుండి ఒక్కసారిగా పుకార్లు మొదలయ్యాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని వెంటనే ఆయన్ను హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారంటూ కథనాలు వచ్చాయి. కృష్ణపై ఇలా ఊహాగానాలు చెలరేగిన వెంటనే ఆయన కుటుంబం ఎలర్ట్ అయింది. పూర్తి క్లారిటీ ఇచ్చింది.


హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పిటల్ లో కృష్ణ జాయిన్ అయిన విషయం నిజమే. కాకపోతే ఆయన ఆరోగ్యానికి వచ్చిన ముప్పేం లేదు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. జనరల్ చెకప్ కోసం మాత్రమే ఆయన హాస్పిటల్ కు వచ్చారు. కృష్ణ ఆరోగ్యంపై ఆయన అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన సంబంధీకులు స్పష్టం చేశారు.


కరోనాకు ముందు నుంచి ఇంటికే పరిమితమయ్యారు కృష్ణ. అప్పుడప్పుడు బయటకొస్తున్నప్పటికీ, కరోనా ఎప్పుడైతే మొదలైందో అప్పట్నుంచి పూర్తిగా బయటకు రావడం మానేశారు. ఎవరైనా ఆయన ఇంటికెళ్లి గౌరవపూర్వకంగా కలవాల్సిందే తప్ప, ఆయన మాత్రం బయట అడుగుపెట్టడం మానేశారు.


అలా కృష్ణతో కొంతమంది సినీ జనాలు దిగిన ఫొటోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటాయి. ఇవి కాకుండా కృష్ణ కుమార్తె మంజుల కూడా తండ్రి ఫొటోల్ని అప్పుడప్పుడు పోస్ట్ చేస్తుంటారు. అయితే రీసెంట్ గా కృష్ణ, తన భార్యను కోల్పోయారు. అప్పట్నుంచి ఆయన పూర్తిగా కనిపించడం మానేశారు.


ఈ నేపథ్యంలో, ఒక్కసారిగా హాస్పిటల్ లో కనిపించడంతో ఆయన ఆరోగ్యం విషమించిందని చాలామంది అనుకున్నారు. కానీ కృష్ణ పీఆర్ టీమ్ ఆ వార్తల్ని ఖండించింది.

First Published:  14 Nov 2022 6:26 AM GMT
Next Story