Telugu Global
Cinema & Entertainment

Virupaksha - పాన్ ఇండియాపై కన్నేసిన విరూపాక్ష

Virupaksha - తెలుగులో హిట్టయిన విరూపాక్ష సినిమాను ఇప్పుడు దేశవ్యాప్తంగా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. డేట్స్ కూడా లాక్ చేశారు.

Virupaksha Movie Review: విరూపాక్ష మూవీ రివ్యూ {2.75/5}
X

Virupaksha Movie Review: విరూపాక్ష మూవీ రివ్యూ {2.75/5}

తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్టయింది విరూపాక్ష సినిమా. సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే 50 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. వరల్డ్ వైడ్ 75 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో విడుదలపై కన్నేశారు.

తమ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుందనే విషయాన్ని సాయిధరమ్ తేజ్ స్వయంగా ప్రకటించాడు. తెలుగులో హిట్టయినట్టుగానే, అన్ని భాషల్లో సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాడు.

"సినిమా చేసే స‌మ‌యంలో నాకు మాట స‌రిగ్గా రాలేదు. ఆ స‌మ‌యంలో నాకు స‌హ న‌టీన‌టులంద‌రూ ఎంత‌గానో హెల్ప్ చేశారు. మా అమ్మ‌కి, డైరెక్ట‌ర్ కార్తీక్ అమ్మ‌గారికి థాంక్స్‌. డైరెక్ష‌న్ డిపార్ట్‌మెంట్‌ స‌పోర్ట్‌కి థాంక్స్. అంద‌రూ హార్డ్ వ‌ర్క్ చేశారు. మీ అంద‌రి ఆశీర్వాదంతో విరూపాక్ష సినిమాను మే 5న హిందీ, త‌మిళ్‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్ చేస్తున్నాం. అలాగే మే 12న క‌న్న‌డ‌లో విడుద‌ల చేస్తున్నాం. అంద‌రూ ఆశీర్వ‌దిస్తార‌ని ఆశిస్తున్నాం."

నిజానికి ఈ సినిమాను ఒకేసారి పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయాలనుకున్నారు. కానీ టైమ్ తక్కువగా ఉండడం, సాయితేజ్ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తెలుగు రిలీజ్ వరకే పరిమితమయ్యారు. ఇప్పుడు సినిమాకు మంచి టాక్ రావడంతో, పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేస్తున్నారు.

First Published:  1 May 2023 5:23 AM GMT
Next Story