Telugu Global
Cinema & Entertainment

Sunil Shraddha Das - సునీల్ హీరో.. శ్రద్ధాదాస్ హీరోయిన్

Sunil Shraddha Das - సునీల్ హీరోగా, శ్రద్ధా దాస్ హీరోయిన్ గా సినిమా తెరకెక్కుతోంది. దీనికి డిఫరెంట్ టైటిల్ పెట్టారు.

Sunil Shraddha Das - సునీల్ హీరో.. శ్రద్ధాదాస్ హీరోయిన్
X

సునీల్, శ్రద్ధా దాస్ హీరోహీరోయిన్లుగా సినిమా తెరకెక్కుతోంది. చైతన్యరావు, మాళవిక సతీశన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. వనమాలి క్రియేషన్స్ బ్యానర్ పై మహిధర్ రెడ్డి, దేవేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంతోష్ కంభంపాటి దర్శకుడు. తాజాగా ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు.

సునీల్ కొత్త సినిమా ‘పారిజాత పర్వం’ అనే ఆసక్తికరమైన టైటిల్ ని పెట్టారు. టైటిల్ పోస్టర్ కూడా చాలా ఇంట్రస్టింగా వుంది. ఓ అమ్మాయికి ముసుగు వేసి చైర్ లో బంధించినట్లు విడుదల చేసిన టైటిల్ లుక్ పోస్టర్ క్యురియాసిటీని పెంచింది. త్వరలోనే మేకర్స్ ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తారు.

ఈ చిత్రంలో వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ వాణి, సమీర్ , గుండు సుదర్శన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కంప్లీట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది ఈ సినిమా. పారిజాత పర్వం అనే టైటిల్ కు సినిమాకు చాలా దగ్గర సంబంధం ఉందని చెబుతున్నారు.

ఈ సినిమాలో హీరోహీరోయిన్లు ఉండరట. కేవలం పాత్రలు మాత్రమే ఉంటాయట. ఇక టైటిల్ పోస్టర్ లో ముసుగు కప్పి ఉంచిన వ్యక్తి ఎవరు? ఆమెను ఎవరు అలా బంధించారనేదే సినిమాలో కీలకమైన అంశం అంటున్నారు




First Published:  11 April 2023 2:26 PM GMT
Next Story