Telugu Global
Cinema & Entertainment

గాడ్ ఫాదర్ మా సెంటిమెంట్ సినిమా

ఘోస్ట్ సినిమాను దసరా బరిలో నిలపడం వెనక ఓ సెంటిమెంట్ ఉందని ప్రకటించారు నిర్మాత సునీల్ నారంగ్. ఇంతకీ ఏంటా సెంటిమెంట్?

గాడ్ ఫాదర్ మా సెంటిమెంట్ సినిమా
X

నాగార్జున హీరోగా నటించిన సినిమా ది ఘోస్ట్. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సునీల్ నారంగ్ ఈ సినిమాను నిర్మించారు. ఓవైపు చిరంజీవి సినిమా రేసులో ఉన్నప్పటికీ, నాగార్జున సినిమాను రిలీజ్ చేయడంపై ఈ నిర్మాత స్పందించాడు. అది తమకు సెంటిమెంట్ అని ప్రకటించాడు.

"సంక్రాంతిలానే దసరా కూడా సినిమా పండగ. రెండు పెద్ద సినిమాలు రావడం ప్రేక్షకులకు సినిమా పండగలా ఉంటుంది. అలాగే నాగార్జున గారి ట్రెండ్ సెట్టర్ 'శివ ' సినిమా కూడా అక్టోబర్ 5 విడుదలైంది. ఆ సెంటిమెంట్ ప్రకారం కూడా అక్టోబర్ 5న విడుదల చేస్తున్నాం. ఈ సినిమాని హిందీలో కూడా విడుదల చేయడాని సన్నాహాలు చేస్తున్నాం."

ఇలా ఘోస్ట్ విడుదల వెనక సెంటిమెంట్ ను బయటపెట్టారు సునీల్ నారంగ్. తన సహ-నిర్మాత పుస్కర్ రామ్మోహన రావుతో కలిసి మీడియాతో మాట్లాడిన సునీల్ నారంగ్.. గాడ్ ఫాదర్ ను కూడా తామే రిలీజ్ చేస్తున్నామని తెలిపారు.

రెండు పెద్ద సినిమాలు ఒకేసారి రావడం వల్ల థియేటర్ల సమస్య రాదని, ఏ సినిమాకి ఎన్ని థియేటర్లు అవసరమో దాని ప్రకారం థియేటర్ల కేటాయింపు ఉంటుందని అన్నారు. గతంలో కూడా రెండు పెద్ద సినిమాలు ఒకేరోజు వచ్చిన సందర్భాలు ఉన్నాయని, బ్యాలెన్స్ చేస్తూ విడుదల చేయడమే సమస్యకు పరిష్కారమని అన్నారు.

First Published:  4 Oct 2022 4:22 AM GMT
Next Story