Telugu Global
Cinema & Entertainment

Sundeep Kishan | సందీప్ కిషన్ సినిమా టైటిల్ ఇదే

Sundeep Kishan - సూపర్ హిట్ కాంబినేషన్ కలిసింది. స్వరూప్ దర్శకత్వంలో సందీప్ కిషన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు టైటిల్ పెట్టారు.

Sundeep Kishan | సందీప్ కిషన్ సినిమా టైటిల్ ఇదే
X

ఊరు పేరు భైరవకోన విజయంతో ఊపుమీదున్న హీరో సందీప్ కిషన్ మరో ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేశాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మేకర్స్ తో చేతులు కలిపాడు. ఈ ప్రాజెక్టుకు స్వరూప్ దర్శకత్వం వహిస్తుండగా, రాహుల్ యాదవ్ నక్కా స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై నిర్మిస్తున్నారు.

తన మొదటి సినిమాతో ప్రశంసలు అందుకున్న స్వరూప్ ఆర్‌ఎస్‌జె, సందీప్ కిషన్ కోసం మరో ఆసక్తికరమైన కథ రెడీ చేశాడు. కథల ఎంపికలో మంచి అభిరుచి ఉన్న రాహుల్.. ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇంతకుముందు ఇతడు ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయతో పాటు.. మళ్లీ రావా, మసూద సినిమాలతో హిట్ కొట్టాడు.

ఇక సందీప్ కిషన్-స్వరూప్ చిత్రానికి 'వైబ్' అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. టైటిల్ లోగో సినిమా జానర్ ను సూచిస్తోంది. యుద్ధం ఎంత పెద్దదైనా, గెలవడం ఎంత కష్టమైనదైనా, ముఖ్యమైనది ఏమిటంటే, మీ పోరాటంలో మీ కోసం కొంతమంది స్నేహితులు ఉన్నారు అనేది ఈ సినిమా థీమ్.

ఫస్ట్ లుక్‌లో సందీప్ కిషన్ వైల్డ్ గా కనిపిస్తున్నాడు. చేతిలో కత్తి పట్టుకున్నాడు. “వైబ్” కాలేజ్ బేస్డ్ యాక్షన్-లవ్ స్టోరీ. ఇది ఒక స్టూడెంట్, అతని స్నేహితులు.. సాధారణ వ్యక్తుల నుంచి రెబల్‌గా మారడం వరకు జరిగిన కథ.

2025 వేసవిలో వైబ్ ని విడుదల చేస్తారు.

First Published:  30 March 2024 5:15 PM GMT
Next Story