Telugu Global
Cinema & Entertainment

సందీప్ కిషన్ పాన్ ఇండియా మూవీ రెడీ

సందీప్ కిషన్ కొత్త సినిమా రెడీ అవుతోంది. ఈసారి పాన్ ఇండియా లెవెల్లో ప్రాజెక్ట్ రెడీ చేస్తున్నాడు ఈ హీరో. టీజర్ ఈ నెల్లోనే రిలీజ్ అవుతుంది.

సందీప్ కిషన్ పాన్ ఇండియా మూవీ రెడీ
X

సందీప్ కిషన్ తొలి పాన్ ఇండియా చిత్రం 'మైఖేల్'. రంజిత్ జయకోడి దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతోంది. విజయ్ సేతుపతి ఇందులో ప్రత్యేక యాక్షన్ రోల్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ లో కనిపించబోతున్నాడు సందీప్ కిషన్. ఈ మేరకు ఆల్రెడీ ఫస్ట్ లుక్ రిలీజైంది.

తాజాగా ఈ సినిమా టీజర్‌ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. 'మైఖేల్' టీజర్ అక్టోబర్ 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా సందీప్ కిషన్, దివ్యాంశ కౌశిక్ లిప్ కిస్ తో పోస్టర్ రిలీజ్ చేశారు. సినిమాలో యాక్షన్‌తో పాటు రొమాన్స్ కూడా ఉందని చెప్పే ప్రయత్నం ఇది.

ఈ చిత్రంలో స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ విలన్ గా నటిస్తుండగా, వరలక్ష్మి శరత్‌కుమార్, వరుణ్ సందేశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, కరణ్ సి ప్రొడక్షన్స్ బ్యానర్లపై భ‌ర‌త్ చౌద‌రి, పుస్కూర్ రామ్మోహ‌న్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. టీజర్ తో విడుదల తేదీని ప్రకటించే ఛాన్స్ ఉంది.




First Published:  15 Oct 2022 8:25 AM GMT
Next Story