Telugu Global
Cinema & Entertainment

Michael Movie Trailer: సందీప్ కిషన్ మూవీ టీజర్ వచ్చేసింది

Michael Movie Trailer Review: సందీప్ కిషన్ హీరోగా నటించిన సినిమా మైఖేల్. ఈ సినిమా ట్రయిలర్ ను బాలకృష్ణ రిలీజ్ చేశారు.

Michael Movie Trailer: సందీప్ కిషన్ మూవీ టీజర్ వచ్చేసింది
X

సందీప్ కిషన్ కొత్త సినిమా రిలీజ్ కు రెడీ అయింది. ఈ సినిమా పేరు మైఖేల్. ఇప్పటివరకు సందీప్ కిషన్ నుంచి వచ్చిన సినిమాలన్నీ ఒకెత్తు, ఈ సినిమా ఒక్కటి ఒకెత్తు. ఎందుకంటే, ఈ హీరో కెరీర్ లో తొలి పాన్ ఇండియా సినిమా ఇది. అంతేకాదు, ఈ హీరో కెరీర్ లో భారీ బడ్జెట్ సినిమా కూడా ఇదే.

అందుకే మైఖేల్ మూవీపై చాలా అంచనాలు పెట్టుకున్నాడు సందీప్ కిషన్. ఆ అంచనాలకు తగ్గట్టే సినిమాకు జాగ్రత్తగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు మైఖేల్ ట్రయిలర్ రిలీజ్ చేశారు. బాలకృష్ణ చేతులమీదుగా విడుదలైంది ఈ ట్రయిలర్.

అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంది మైఖేల్ ట్రయిలర్. ఇంకా చెప్పాలంటే ఇందులో భారీ తారాగణంతో పాటు విషయం కూడా ఉంది. సందీప్ కిషన్ తో పాటు, విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, అనసూయ, వరలక్ష్మి శరత్ కుమార్.. ఇలా భారీ స్టార్ కాస్ట్ ఉంది. ఎక్కడా కథ రివీల్ అవ్వకుండా జాగ్రత్త పడ్డారు, అదే టైమ్ లో సినిమాపై ఆసక్తి పెంచేలా ట్రయిలర్ కట్ చేశారు. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి.

డార్క్ థీమ్ తో థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాకు రంజిత్ జయకొడి దర్శకుడు. భరత్ చౌదరి, ఏషియన్ సునీల్ నిర్మించారు. ఫిబ్రవరి 3న మైఖేల్ వరల్డ్ వైడ్ థియేటర్లలోకి వస్తున్నాడు.Next Story