Telugu Global
Cinema & Entertainment

Bhairavakona | రికార్డ్ సృష్టించిన సందీప్ కిషన్ సాంగ్

Bhairavakona - సందీప్ కిషన్ కొత్త సినిమా ఊరు పేరు భైరవకోన. ఈ సినిమాలో ఓ సాంగ్ పెద్ద హిట్టయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ పాట మరో రికార్డ్ సృష్టించింది

Bhairavakona | రికార్డ్ సృష్టించిన సందీప్ కిషన్ సాంగ్
X

హీరో సందీప్ కిషన్, విఐ ఆనంద్ ల మోస్ట్ అవైటెడ్ ఫాంటసీ అడ్వెంచర్ ‘ఊరు పేరు భైరవకోన’. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తుండగా, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సమర్పిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఊరు పేరు భైరవకోన ప్రమోషనల్ కంటెంట్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం కోసం శేఖర్ చంద్ర కంపోజ్ చేసిన ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయింది. ఇందులో 'నిజమే నే చెబుతున్నా' పాట సెన్సేషనల్ వైరల్ హిట్ గా నిలిచింది. స్టార్ సింగర్ సిద్ శ్రీరాం పాడిన ఈ పాట అందరినీ మెస్మరైజ్ చేసింది. శ్రీమణి అందించిన సాహిత్యం మరింత ఆకర్షణగా నిలిచింది.

ఈ పాటలో సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ బ్యూటీఫుల్ కెమిస్ట్రీ ప్రేక్షకులని కట్టిపడేసింది. ఈ సాంగ్ రిలీజ్ అయినప్పటికీ నుంచి అన్నీ సోషల్ మీడియా మ్యూజిక్ ఫ్లాట్ ఫార్మ్స్ లో టాప్ ట్రెండింగ్ అలరిస్తోంది. తాజాగా ఈ పాట 100 మిలియన్+ వ్యూస్ ని క్రాస్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.

ఇక ఇటివలే విడుదలైన ఊరు పేరు భైరవకోన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. వండర్ ఫుల్ ఫాంటసీ అడ్వెంచర్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకుల్లో క్యురియాసిటీని పెంచింది. వర్ష బొల్లమ్మ, కావ్యా థాపర్‌ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతుంది.

First Published:  20 Jan 2024 3:52 PM GMT
Next Story