Telugu Global
Cinema & Entertainment

Sundeep Kishan: రక్తం ధారపోసి పనిచేశాను

Sundeep Kishan Michael movie - మైఖేల్ మూవీ కోసం రక్తం ధారపోసి పనిచేశానంటున్నాడు హీరో సందీప్ కిషన్. ప్రేక్షకులు ప్రేమ కురిపిస్తే, ఎంత కష్టమైనా పడటానికి సిద్ధమని ప్రకటించాడు

Sundeep Kishan: రక్తం ధారపోసి పనిచేశాను
X

తన తొలి పాన్ ఇండియా సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు హీరో సందీప్ కిషన్. ఈ సినిమా కోసం రక్తం ధారపోసి పనిచేశానంటున్నాడు. ఎప్పుడు సినిమా విడుదలకు సిద్ధమైనా తనకు కాస్త టెన్షన్ ఉంటుందని, కానీ ఈసారి మైఖేల్ విషయంలో ఆ టెన్షన్ లేదంటున్నాడు.

"ఈ సినిమాకి ఎంత కావాలో అంత పెట్టేశాను. ట్రైలర్ కి, టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. నా బ్లడ్ మొత్తం పెట్టి ఈ సినిమా చేశానని చాలా మంది చెప్పారు. అయితే ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఇలానే ప్రేమ చూపిస్తూ ఉంటే, ఇంకా అద్భుతంగా పని చేస్తాను"

ఇలా మైఖేల్ సినిమాపై పూర్తి నమ్మకంతో మాట్లాడాడు సందీప్ కిషన్. విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, అనసూయ, వరలక్ష్మి లాంటి పెద్ద నటీనటులు మైఖేల్ లో నటించడం ఆనందంగా ఉందన్న సందీప్ కిషన్.. మైఖేల్ లాంటి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉందంటున్నాడు.

రంజిత్ జయకొడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. భరత్ చౌదరి, పుష్కర్ రామ్మోహనరావు కలిసి నిర్మించారు. ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రాబోతోంది మైఖేల్ మూవీ.

First Published:  1 Feb 2023 3:49 PM GMT
Next Story