Telugu Global
Cinema & Entertainment

మరో పెద్ద సినిమాలో సందీప్ కిషన్

టాలీవుడ్ లో బిజీ హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్నాడు సందీప్ కిషన్. ఇప్పుడీ హీరో, మరో హీరో సినిమాలో కీలక పాత్ర పోషించడానికి అంగీకరించాడు.

మరో పెద్ద సినిమాలో సందీప్ కిషన్
X

నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్ భారీ పీరియాడికల్ మూవీ "కెప్టెన్ మిల్లర్". ఫస్ట్ లుక్ పోస్టర్ తో అందర్నీ ఎట్రాక్ట్ చేసింది ఈ సినిమా. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక నిపుణులు పనిచేస్తున్న ఈ చిత్రంలోకి ఇప్పుడు మరో హీరో ఎంటర్ అయ్యాడు. అతడే సందీప్ కిషన్.

టాలీవుడ్ లో బాగా పాపులర్ సందీప్ కిషన్. విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్ వంటి బిగ్ స్టార్ల తో కలిసి సందీప్ చేస్తున్న 'మైఖేల్' చిత్రం కూడా భారీ అంచనాలను పెంచింది. ఇప్పుడీ హీరో 'కెప్టెన్ మిల్లర్' ప్రాజెక్ట్ లోకి రావడం మరింత ఆకర్షణగా నిలిచింది.

ధనుష్ సినిమాలకు పాన్ ఇండియా అప్పీల్ ఉంది. అతడు స్ట్రయిట్ బాలీవుడ్ సినిమాలు చేశాడు. రీసెంట్ గా ఓ హాలీవుడ్ మూవీ కూడా చేశాడు. ఇలాంటి హీరో నటిస్తున్న ప్రాజెక్టులోకి సందీప్ కిషన్ అడుగుపెట్టాడు. సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ పై వస్తోంది 'కెప్టెన్ మిల్లర్'.

1930-40ల బ్యాక్ డ్రాప్ తో వస్తోంది ఈ సినిమా. ధనుష్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీ ఇది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సత్యజ్యోతి ఫిలింస్‌ పతాకంపై సెంధిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌ నిర్మిస్తున్నారు.

First Published:  17 Sep 2022 1:21 PM GMT
Next Story