Telugu Global
Cinema & Entertainment

Maya 1 Movie | సందీప్ కిషన్ ఫస్ట్ లుక్ ఇదే

Maya 1 Movie - సందీప్ కిషన్ తాజా చిత్రం మాయావన్. ఈ మూవీ నుంచి అతడి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

Maya 1 Movie | సందీప్ కిషన్ ఫస్ట్ లుక్ ఇదే
X

హీరో సందీప్ కిషన్, డైరెక్టర్ సివి కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన సెన్సేషనల్ హిట్ ప్రాజెక్ట్‌ జెడ్ తర్వాత సెకండ్ పార్ట్ కోసం మరోసారి చేతులు కలిపారు. 'మాయవన్' అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సీక్వెల్ ను ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌ నేపధ్యంలో రూపొందే ఈ చిత్రాన్ని అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు.

సందీప్ కిషన్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ పవర్ ప్యాక్డ్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. సందీప్ కిషన్ ఒక పిడికిలిని బిగించి మరో చేతిలో సూపర్ పవర్ వెపన్ తో ఇంటెన్స్ గా చూస్తున్న ఫస్ట్ లుక్ బాగుంది. ఈ ఫస్ట్ లుక్ సినిమాపై చాలా క్యూరియాసిటినీ పెంచింది.

ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు, సాహో ఫేమ్ నీల్ నితిన్ ముఖేష్‌ను కీలక పాత్రలో నటిస్తున్నాడు. సందీప్‌ కిషన్‌ సరసన ఆకాంక్ష రంజన్‌ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

టాప్-క్లాస్ ప్రొడక్షన్, టెక్నికల్ స్టాండర్డ్స్‌తో హై బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రం, సూపర్‌ విలన్‌తో ఒక సామాన్యుడి పోరాటం కథగా వస్తోంది. సెన్సేషనల్ కంపోజర్ సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.




First Published:  8 May 2024 1:27 AM GMT
Next Story