Telugu Global
Cinema & Entertainment

Sundeep Kishan | ఈసారి హిట్ గ్యారెంటీ అంటున్న హీరో

Sundeep Kishan - ఈసారి గ్యారెంటీ హిట్ అంటున్నాడు సందీప్ కిషన్. ఊరుపేరు భైరవకోన సినిమా తనకు సక్సెస్ అందిస్తుందని చెబుతున్నాడు.

Sundeep Kishan | ఈసారి హిట్ గ్యారెంటీ అంటున్న హీరో
X

సందీప్ కిషన్ నటించిన ఫాంటసీ అడ్వెంచర్ మూవీ 'ఊరు పేరు భైరవకోన'. విఐ ఆనంద్ దర్శకత్వం వహించాడు. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మించిన ఈ సినిమాకు అనీల్ సుంకర నిర్మాత.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషన్స్ తో ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ఫిబ్రవరి 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అంటున్నాడు సందీప్ కిషన్.

"ఊరు పేరు భైరవకోన కోసం దాదాపు రెండున్నరేళ్ళ నిరంతరం కష్టపడ్డాం. దర్శకుడు వీఐ ఆనంద్, తన మొదటి సినిమా కూడా నాతోనే చేయడం గర్వంగా భావిస్తాను. అనిల్ సుంకరతో మంచి అనుబంధం ఉంది. సాధారణంగా నిర్మాతగా ఆయన పేరు వేసుకోరు. కానీ నేను పట్టుపట్టి ‘నిను వీడని నీడను నేను’ సినిమాకి వేశాను. అది మాకు చాలా కలిసొచ్చింది. ఊరు పేరు భైరవకోన నాకు చాలా స్పెషల్ మూవీ. ఫాంటసీ, సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ ఉన్న మంచి కమర్షియల్ తెలుగు సినిమా ఇది."

ఇలా సినిమాపై పూర్తి విశ్వాసాన్ని ప్రకటించాడు సందీప్ కిషన్. సినిమా కంటెంట్ పై నమ్మకంతో, 2 రోజుల ముందు నుంచే పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు.

First Published:  11 Feb 2024 2:37 PM GMT
Next Story