Telugu Global
Cinema & Entertainment

Sundeep Kishan | బ్లాక్ బస్టర్ డైరక్టర్ తో సందీప్ కిషన్ మూవీ

Sundeep Kishan - హీరో సందీప్ కిషన్ తన 30వ చిత్రాన్ని ఎనౌన్స్ చేశాడు. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో నటించబోతున్నాడు.

Sundeep Kishan | బ్లాక్ బస్టర్ డైరక్టర్ తో సందీప్ కిషన్ మూవీ
X

'ఊరు పేరు భైరవకోన' బ్లాక్‌బస్టర్ విజయంతో దూసుకుపోతున్న హీరో సందీప్ కిషన్‌ కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లు చేస్తున్నాడు. అందులో ఒక సినిమాను ఈరోజు ప్రకటించాడు. ఈరోజు తన ల్యాండ్‌మార్క్ 30వ సినిమాని అనౌన్స్ చేశాడు.

'ధమాకా' వంటి భారీ విజయాన్ని అందించిన డైరెక్టర్ త్రినాధరావు నక్కిన సందీప్ కిషన్ 30వ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ సంయుక్తంగా నిర్మించనున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన వంటి వరుస హిట్‌ల తర్వాత, వారి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ కోసం వీళ్లు మళ్లీ కలిశారు.

త్రినాధ రావు నక్కిన, ప్రసన్న కుమార్ బెజవాడ కాంబినేషన్ సూపర్ హిట్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ధమాకాతో సహా అనేక బ్లాక్‌బస్టర్‌లను అందించారు. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ కొత్త చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే డైలాగ్‌లను అందిస్తున్నాడు.

ఈ సినిమాలో సందీప్ కిషన్ డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. సినిమాలో త్రినాథరావు నక్కిన, ప్రసన్నల మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, టెక్నికల్ టీం వివరాలు త్వరలో తెలియజేస్తారు.

First Published:  12 March 2024 5:25 PM GMT
Next Story