Telugu Global
Cinema & Entertainment

Sundeep Kishan | సందీప్ కిషన్ హీరోగా సైన్స్-ఫిక్షన్ సినిమా

Sundeep Kishan - ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఓ సినిమా చేస్తున్నాడు సందీప్ కిషన్. ఇప్పుడు అదే బ్యానర్ పై మరో సినిమా ప్రకటించాడు.

Sundeep Kishan | సందీప్ కిషన్ హీరోగా సైన్స్-ఫిక్షన్ సినిమా
X

హీరో సందీప్ కిషన్, డైరెక్టర్ విఐ ఆనంద్‌ దర్శకత్వంలో ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో చేస్తున్న సినిమా ‘ఊరు పేరు భైరవకోన’. ఇప్పుడు ఇదే బ్యానర్ పై మరో సినిమా చేయబోతున్నాడు సందీప్ కిషన్.

ప్రాజెక్ట్‌-జెడ్/మాయవన్ తర్వాత సందీప్ కిషన్‌తో కలిసి మరోసారి సినిమా చేయబోతున్నాడు దర్శకుడు సివి కుమార్. ప్రాజెక్ట్‌జెడ్/మాయవన్ వరల్డ్‌లో సెట్ చేయబడిన ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ దీనికి సీక్వెల్. ఈ చిత్రానికి మాయావన్ అని టైటిల్ పెట్టారు.

ధర్మ ప్రొడక్షన్స్ మొదటి ఓటీటీ చిత్రం ‘గిల్టీ’తో తన నటనను ప్రారంభించి, ఆ తర్వాత విమర్శకుల ప్రశంసలు పొందిన కొన్ని ఓటీటీ సిరీసుల్లో నటించిన ఆకాంక్ష రంజన్ కపూర్.. ఈ చిత్రంలో సందీప్ కిషన్ కు జోడిగా నటించనుంది. మాయావన్ ఆమెకు తొలి సినిమా.

సూపర్‌ పవర్స్ ఉన్న ఓ విలన్‌తో ఒక సామాన్యుడు ఎలా తలపడ్డాడు అనే కోణంలో ఈ సినిమా సాగుతుంది. సెన్సేషనల్ కంపోజర్ సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై మరిన్ని వివరాలు బయటకు రాబోతున్నాయి.

First Published:  9 Dec 2023 3:33 PM GMT
Next Story