Telugu Global
Cinema & Entertainment

Sumanth: సుమంత్ కెరీర్ లో తొలి డివోషనల్ మిస్టరీ

హీరో సుమంత్ మరో కొత్త కథ ఎంచుకున్నాడు. ఈ సారి డివోషనల్ మిస్టరీ కాన్సెప్ట్ లో సినిమా చేస్తున్నాడు

Sumanth: సుమంత్ కెరీర్ లో తొలి డివోషనల్ మిస్టరీ
X

డిఫరెంట్ కథలు ఎంచుకుంటాడు సుమంత్. ఓసారి లవ్ స్టోరీ చేస్తే, మరోసారి థ్రిల్లర్ చేస్తాడు, ఇంకోసారి సస్పెన్స్ డ్రామా కథ సెలక్ట్ చేసుకుంటాడు. ఈసారి ఈ హీరో డివోషనల్ మిస్టరీ కథాంశాన్ని ఎంచుకున్నాడు. ఆ సినిమా పేరు వారాహి.


వారాహి అమ్మవారిని ఏడు శక్తి రూపాల్లో ఒకరిగా కొలుస్తారు. ఏడుగురు దేవతా మాతృమూర్తుల్లో వారాహి ఒకరు. వరాహ స్వామి శక్తి నుండి ఉద్భవించిన వారాహి అమ్మవారి ఆలయ నేపథ్యంతో సుమంత్ హీరోగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. గతంలో సుమంత్ తో సుబ్రమణ్యపురం లాంటి థ్రిల్లర్ ను తీసిన సంతోష్ జాగర్లపూడి, ఈ తాజా చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు.


ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చేవారం నుంచి మొదలవుతుంది. ఈ కథ వినగానే హీరో సుమంత్ లేచి నిల్చొని చప్పట్లు కొట్టాడట. అంత హాగా ఈ కథ నచ్చిందంట. కాంతార, కార్తికేయ-2 సినిమాల టైపులో వారాహి సినిమా హిట్టవుతుందనే నమ్మకంతో ఉన్నాడు ఈ హీరో.


త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ తో పాటు ఇతర నటీనటులు, టెక్నీషియన్ల వివరాల్ని వెల్లడిస్తారు. సుమంత్ నటించిన 2 సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. అవి విడుదలైన తర్వాత వారాహి థియేటర్లలోకి వస్తుంది.

First Published:  15 Nov 2022 11:39 AM GMT
Next Story