Telugu Global
Cinema & Entertainment

Sukumar | సుకుమార్ నిర్మాతగా ఇంట్రెస్టింగ్ మూవీ

Sukumar | కొత్త టాలెంట్ ను పరిచయం చేసే సుకుమార్, ఈసారి మరో దర్శకుడితో కలిసి సినిమా చేయబోతున్నాడు. ఇంతకీ ఎవరా దర్శకుడు?

Sukumar | సుకుమార్ నిర్మాతగా ఇంట్రెస్టింగ్ మూవీ
X

ప్ర‌తిభ గ‌ల క‌ళాకారుల‌ను, సాంకేతిక నిపుణుల‌ను ప్రోత్స‌హించ‌డంలో ద‌ర్శ‌కుడు సుకుమార్ ఎల్ల‌ప్పుడూ ముందు వ‌రుస‌లో ఉంటారు. ఆయ‌న ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసి తొలిచిత్రంతోనే బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యాలు అందుకున్న ద‌ర్శ‌కులు కొంద‌రైతే, ఆయ‌న‌ను త‌మ గురువుగా భావించి ఏక‌ల‌వ్య శిష్యులుగా మారిపోయి సినిమాలు తెర‌కెక్కించే ద‌ర్శ‌కులు మ‌రికొంద‌రు ఉన్నారు.

అలా ఏక‌ల‌వ్య శిష్యుడి జాబితాలో ఉంటాడు దర్శకుడు యశ్వసి. దీప‌క్ స‌రోజ్ హీరోగా సిద్థార్థ్ రాయ్ పేరుతో ఓ వైవిధ్య‌మైన ప్రేమ‌క‌థా చిత్రాన్ని రూపొందించాడు యశ్వసి. త్వర‌లోనే ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కాగా సిద్దార్థ్ రాయ్ చిత్రం విష‌యంలో య‌శ్వ‌సి ప్ర‌తిభ‌ను చూసి ఎంతో ఇంప్రెస్ అయ్యారు ద‌ర్శ‌కుడు సుకుమార్‌. అందుకే సుకుమార్ త‌న సొంత నిర్మాణ సంస్థ అయిన సుకుమార్ రైటింగ్స్ సంస్థ‌లో య‌శ‌స్వి త‌దుప‌రి చిత్రం చేసే అవ‌కాశం ఇచ్చారు.

ఇప్ప‌టికే సుకుమార్ రైటింగ్స్‌లో ప‌లు బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలు నిర్మించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం సుకుమార్ రైటింగ్స్ సంస్థ ప‌లు అగ్ర నిర్మాణ సంస్థ‌ల‌తో క‌లిసి పాన్ ఇండియా చిత్రాల‌తో పాటు విభిన్న‌మైన, వైవిధ్య‌మైన చిత్రాల‌ను నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాకు కూడా సుకుమార్ రైటింగ్స్ సహ-నిర్మాతగా వ్యవహహరిస్తోంది. ఇప్పుడు యశ్వసికి అవకాశం ఇచ్చారు సుకుమార్.

First Published:  8 Jan 2024 4:58 PM GMT
Next Story