Telugu Global
Cinema & Entertainment

క్లైమాక్స్ కోసం అనుకున్న సీన్ ఇంటర్వెల్ కు వచ్చింది

పుష్ప సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ మేటర్ బయటపెట్టాడు దర్శకుడు సుకుమార్. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లయిమాక్స్ సీన్ కు సంబంధించి షాకింగ్ మేటర్ బయటపెట్టాడు

క్లైమాక్స్ కోసం అనుకున్న సీన్ ఇంటర్వెల్ కు వచ్చింది
X

ఇది పుష్ప సినిమాకు సంబంధించిన మేటర్. ఆల్రెడీ ఈ సినిమా చరిత్ర గురించి అందరికీ తెలుసు. కాకపోతే ఇప్పుడు పూరి జగన్నాధ్ స్టేట్ మెంట్ తో ఈ సినిమా మరోసారి తెరపైకొచ్చింది. పుష్ప సినిమా క్లయిమాక్స్ లో హీరో-విలన్ కూర్చొని మాట్లాడుకుంటారు. ఎలాంటి ఫైట్ ఉండదు, కేవలం పెర్ఫార్మెన్స్ మాత్రమే కనిపిస్తుంది. అలా కూర్చొని మాట్లాడుకునే క్లయిమాక్స్ తనకు బాగా నచ్చిందని చెప్పుకొచ్చాడు పూరి జగన్నాధ్.

దీంతో ఆ సన్నివేశంపై మరోసారి చర్చ మొదలైంది. తాజాగా దర్శకుడు సుకుమార్ కూడా ఆ సీన్ పై స్పందించాడు. తనకు గురువులాంటి పూరి జగన్నాధ్, ఆ సన్నివేశాన్ని మెచ్చుకోవడంపై ఆనందం వ్యక్తం చేసిన సుకుమార్.. ఆ సీన్ కు సంబంధించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. నిజానికి అది క్లయిమాక్స్ కాదంట. సినిమా ఇంటర్వెల్ సీన్ అంట.

అవును.. పుష్ప సినిమాను 2 భాగాలుగా తీయాలనే ఆలోచన చేయకముందు.. ఆ సీన్ దగ్గర ఇంటర్వెల్ బ్యాంగ్ వేసుకున్నాడట సుకుమార్. ఎప్పుడైతే సినిమా నిడివి పెరిగి, 2 భాగాలు అయిందో, అప్పుడిక స్క్రీన్ ప్లే మార్చక తప్పలేదు. దీంతో ఇంటర్వెల్ కోసం అనుకున్న ఆ సన్నివేశాన్ని, క్లయిమాక్స్ కు తీసుకొచ్చానని అసలు మేటర్ బయటపెట్టాడు సుకుమార్.

పుష్ప సినిమా ఇంటర్వెల్ లో సునీల్ కు వార్నింగ్ ఇస్తాడు అల్లు అర్జున్. దాన్ని ఇంటర్వెల్ బ్యాంగ్ గా మార్చేందుకు, ఆ సీన్ ను బాగా పొడిగించాల్సి వచ్చిందని వెల్లడించాడు.

తాజాగా పుష్ప పార్ట్-2 స్టార్ట్ అయింది. వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతోంది. పుష్ప సినిమా దేశవ్యాప్తంగా హిట్టవ్వడంతో, పార్ట్-2పై అందరి దృష్టి పడింది.

First Published:  24 Aug 2022 1:00 PM GMT
Next Story