Telugu Global
Cinema & Entertainment

OG Movie | ఓజీ టైటిల్ అర్థం ఇదే

OG movie - పవన్ కల్యాణ్ హీరోగా ఓజీ సినిమా చేస్తున్నాడు సుజీత్. తాజాగా ఈ సినిమా టైటిల్ పై స్పందించాడు.

OG Movie | ఓజీ టైటిల్ అర్థం ఇదే
X

పవన్ కల్యాణ్, సుజీత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఓజీ. పవన్ నుంచి థియేటర్లలోకి వచ్చే తదుపరి చిత్రం ఇదే. ఇప్పుడీ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు దర్శకుడు సుజీత్. మరీ ముఖ్యంగా టైటిల్ వెనక అర్థాన్ని బయటపెట్టాడు.

ఓజీ అంటే సాధారణంగా ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని అర్థం. కానీ తమ సినిమా టైటిల్ ఓజీకి అర్థం వేరంటున్నాడు సుజీత్. ఇందులో ఓ అంటే ఓజాస్, జీ అంటే గంభీర్ అని అర్థం అంటున్నారు. సినిమాలో ఓజాస్ అనే మాస్టర్ పేరు, ఇక గంభీర్ అనేది హీరో పేరు. అందుకే ఈ సినిమాకు ఓజీ అనే టైటిల్ పెట్టినట్టు వెల్లడించాడు.

ఈ సినిమాకు సంబంధించి మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయింది. పవన్ మరో 20 రోజులు కాల్షీట్లు ఇస్తే సినిమా పూర్తయిపోతుందని అంటున్నాడు సుజీత్. అన్నట్టు ఈ సినిమాకు సంబంధించి ఆల్రెడీ ట్రయిలర్ కూడా రెడీ చేసి పెట్టాడట ఈ దర్శకుడు.

డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది ఓజీ సినిమా. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది.

First Published:  26 May 2024 5:44 PM GMT
Next Story