Telugu Global
Cinema & Entertainment

Suhas | ఓ భామ అయ్యో రామ!

Suhas - వరుసపెట్టి సినిమాలు చేస్తున్న సుహాస్, మరో సినిమా స్టార్ట్ చేశాడు. ఈ మూవీకి 'ఓ భామ అయ్యో రామ' అనే టైటిల్ పెట్టారు.

Suhas | ఓ భామ అయ్యో రామ!
X

వైవిధ్య‌మైన చిత్రాల‌తో న‌టుడిగా త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక మార్క్‌ను క్రియేట్ చేసుకున్న నటుడు సుహాస్. ఆయ‌న హీరోగా న‌టిస్తున్న మ‌రో వైవిధ్య‌మైన ప్రేమ‌క‌థా చిత్రం ఓ భామ అయ్యో రామ. మాళ‌విక మ‌నోజ్ హీరోయిన్‌.

ఈ చిత్రం ఓపెనింగ్, హైద‌రాబాద్‌లోని ఫిలింన‌గ‌ర్ దైవ‌స‌న్నిధానంలో జరిగింది. ఆ వెంటనే రెగ్యులర్ షూట్ కూడా మొదలైంది. చిత్ర‌ల‌హ‌రి టాకీస్ బ్యానర్ పై హ‌రీష్ న‌ల్లా, ప్ర‌దీప్ తాళ్లపు రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ గోదాల ద‌ర్శ‌కుడు.

హీరో, హీరోయిన్‌పై చిత్రీక‌రించిన ముహుర్త‌పు స‌న్నివేశానికి ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్ కొట్టగా.. ద‌ర్శకుడు వ‌శిష్ట కెమెరా స్విచ్చాన్ చేశారు. మ‌రో ద‌ర్శ‌కుడు కొల‌ను శైలేష్ బౌండెడ్ స్కిప్ట్‌ను ద‌ర్శ‌కుడికి అంద‌జేశారు.

మారుతి ద‌గ్గ‌ర డైరెక్ష‌న్ డిపార్ట్‌మెంట్‌లో ప‌నిచేసిన అనుభవంతో ఈ కథ రాసుకున్నాడు దర్శకుడు రామ్ గోదాల. ఈ చిత్రంతో నువ్వు-నేను ఫేం అనితా రీఎంట్రీ ఇస్తోంది. ఇందులో ఆమె కీలక పాత్రలో కనిపించనుంది. ర‌థ‌న్ సంగీతం చిత్రానికి అద‌న‌పు బలం అంటున్నారు మేకర్స్.

First Published:  30 March 2024 5:12 PM GMT
Next Story