Telugu Global
Cinema & Entertainment

Suhas | దిల్ రాజు బ్యానర్ లో సుహాస్ సినిమా

Suhas - గతేడాది డిసెంబర్ లోనే దిల్ రాజు బ్యానర్ పై ఓ సినిమా స్టార్ట్ చేశాడు సుహాస్. ఇప్పుడీ సినిమా కొలిక్కి వచ్చింది. త్వరలోనే ప్రచారం షురూ చేస్తారు.

Suhas | దిల్ రాజు బ్యానర్ లో సుహాస్ సినిమా
X

గ‌తేడాది బ‌ల‌గం వంటి సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాన్ని నిర్మించిన బ్యాన‌ర్ దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్. ఇప్పుడీ బ్యానర్ పై సుహాస్ హీరోగా సినిమా తెరకెక్కుతోంది. దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌లో ఇది నాలుగో సినిమా. డిసెంబర్ లోనే ఈ సినిమా లాంఛ్ అయింది. ఇప్పుడీ సినిమా విడుదల తేదీని ప్రకటించారు.

సుహాస్ జ‌త‌గా సంకీర్త‌న విపిన్ న‌టిస్తుంది. నిర్మాత శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స‌లార్ చిత్రానికి డైలాగ్ రైట‌ర్‌గా వ‌ర్క్ చేసిన సందీప్ రెడ్డి బండ్ల ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. లేటెస్ట్‌గా చిత్ర యూనిట్ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించింది. `అంద‌రూ మెచ్చే వినోదం ప్రారంభం అవుతుంది. మీ క్యాలెండ‌ర్‌లో మే 24ని గుర్తు పెట్టుకోండి. దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్ లో నాలుగో చిత్రంలో నేను న‌టిస్తున్నాను. మేం అద్భుత‌మైన కామెడీతో వేడి పుట్టించ‌టానికి సిద్ధంగా ఉన్నాం` అని సుహాస్ ప్రకటించాడు.

ఈ చిత్రం మే 24న థియేట‌ర్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చ‌సింది. అందులో చిన్న పాప న్యాయదేవతగా క‌నిపిస్తోంది. చిన్నారి కళ్లకు గంతలు కట్టుకుని ఒక చేతిలో త్రాసు పట్టుకొని కనిపించింది. పోస్ట‌ర్ చూస్తుంటే ఈ సినిమా ఫ్యామిలీ ఎమోష‌న్స్ ఉన్న‌ ఒక ఫ‌న్నీ కోర్టు డ్రామా అని అర్థ‌మ‌వుతుంది. త్వరలోనే సినిమా టైటిల్ ను ప్రకటిస్తారు.

ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. బేబి వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రానికి సంగీతాన్ని అందించిన‌ విజ‌య్ బుల్గానిన్ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వ‌హిస్తున్నారు. బ‌ల‌గం వంటి సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ ఆకాశం దాటి వ‌స్తావా సినిమాను రూపొందిస్తోంది. అలాగే ఇటీవ‌ల ఈ బ్యాన‌ర్ ఆశిష్ హీరోగా మూడో ప్రాజెక్ట్‌ను కూడా అనౌన్స్ చేశారు. ఇప్పుడు సుహాస్ హీరోగా నాలుగో సినిమా సిద్ధ‌మ‌వుతుంది.

First Published:  20 March 2024 2:30 AM GMT
Next Story