Telugu Global
Cinema & Entertainment

Suhas | హ్యాట్రిక్ కొట్టిన సుహాస్

Suhas - సుహాస్ హ్యాట్రిక్ కొట్టాడు. అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ సక్సెస్ అయింది.

Suhas | హ్యాట్రిక్ కొట్టిన సుహాస్
X

ఈ ఇయర్ బిగినింగ్ లోనే టాలీవుడ్ కు మరో సూపర్ హిట్ ఇచ్చింది "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమా. సుహాస్, శివాని నాగరం జంటగా నటించిన ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. దర్శకుడు దుశ్యంత్ కటికినేని రూపొందించారు. శరణ్య ప్రదీప్, నితిన్ కీ రోల్స్ చేశారు. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని చోట్లా బ్లాక్ బస్టర్ దిశగా వెళ్తున్న "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో సుహాస్ మాట్లాడాడు.

"నాకు హ్యాట్రిక్ ఇచ్చిన ఆడియెన్స్ కు థ్యాంక్స్. నన్ను నమ్మి థియేటర్స్ కు వస్తున్నందుకు సంతోషంగా ఉంది. సినిమా రిలీజ్ ముందే నేను, ధీరజ్ గారు అనుకున్నాం ఈ సినిమాతో హిట్ కొడుతున్నామని. ఇవాళ ఆ మాట నిజమైనందుకు హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో హీరోతో పాటు మిగతా క్యారెక్టర్స్ కు ఇంపార్టెన్స్ ఉంది. అదే ఈ స్క్రిప్ట్ లో ఉన్న బలం. మిగతా వారు బాగా పర్ ఫార్మ్ చేసినా సినిమా హిట్టైన పేరు హీరోకే పేరొస్తుంది. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు"కు పనిచేసిన ప్రతి ఒక టీమ్ మెంబర్ కు థ్యాంక్స్ చెబుతున్నా. మూడు రోజుల్లో మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇంకా పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నా."

సుహాస్ తొలి థియేట్రికల్ రిలీజ్ రైటర్ పద్మభూషణ్. అంతకంటే ముందు అతడు కలర్ ఫొటోతో హిట్ కొట్టాడు. ఇప్పుడు అంబాజీ పేట మ్యారేజీ బ్యాండుతో మరో సక్సెస్ కొట్టాడు. అలా కెరీర్ లో హ్యాట్రిక్ అందుకున్నాడు. ఇతడి చేతిలో ఇప్పుడు 6 సినిమాలున్నాయి.

First Published:  7 Feb 2024 12:32 AM GMT
Next Story