Telugu Global
Cinema & Entertainment

Janaka Aithe Ganaka | మరో కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న సుహాస్

Janaka Aithe Ganaka - సుహాస్ కొత్త సినిమా జనక అయితే గనుక. ఈ సినిమా ట్రయిలర్ వచ్చింది.

Janaka Aithe Ganaka | మరో కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న సుహాస్
X

సుహాస్, సంగీర్తన హీరోహీరోయిన్లుగా దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న తాజా చిత్రం ‘జనక అయితే గనక’. శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని సందీర్ రెడ్డి బండ్ల డైరెక్ట్ చేశాడు. సెప్టెంబ‌ర్ 7న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తాజాగా మేకర్స్, ఈ సినిమా ట్రయిలర్ రిలీజ్ చేశారు.

ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే.. సుహాస్‌కు పెళ్లైన‌ప్పటికీ పిల్ల‌లు వ‌ద్ద‌ని అనుకుంటూ ఉంటాడు. అందుకు కార‌ణం.. ఖ‌ర్చులు పెరిగిపోతాయ‌ని అత‌ని భ‌యం. భార్య‌కు ఏం చెప్పి మెనేజ్ చేస్తున్నాడ‌నేది ఎవ‌రికీ అర్థం కాదు. అతని కుటుంబ స‌భ్యులంద‌రూ పిల్ల‌లు క‌న‌మ‌ని ఎంత బ‌లవంతం చేసినా అంద‌రికీ స‌ర్ది చెప్పేస్తుంటాడనే విష‌యాల‌ను కామెడీ స‌న్నివేశాల‌తో చూపించారు.

ఇలాంటి మ‌న‌స్త‌త్వ‌మున్న హీరోకి త‌న భార్య గ‌ర్భ‌వ‌తి అని తెలిసిన‌ప్పుడు ఏం చేస్తాడు.. మ‌ధ్య త‌ర‌గ‌తి వ్య‌క్తి అయిన హీరో ఎవ‌రిపై కేసు వేస్తాడు.. ఎందుకు? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందేనంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

బ‌ల‌గం వంటి సెన్సేష‌న్ బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించి దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్‌లో వ‌స్తోన్న సినిమా ఇది. బ‌ల‌గం సినిమా కంటెంట్‌పై దిల్ రాజు ఎంత న‌మ్మ‌కంగా ఉన్నారో.. అంతే న‌మ్మ‌కంతో ‘జనక అయితే గనక’ సినిమాపై న‌మ్మ‌కంగా ఉన్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, నా ఫేవరేట్ నా పెళ్లాం సాంగ్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ట్రైల‌ర్ కూడా సినిమాపై ఆస‌క్తిని మ‌రింత పెంచింది.

First Published:  28 Aug 2024 8:37 AM GMT
Next Story