Telugu Global
Cinema & Entertainment

Sudheer Varma - ఫ్లాపుల్లో హ్యాట్రిక్ కొట్టాడు

Sudheer Varma gets back to back flops - రావణాసుర సినిమాతో తన ఫ్లాపుల పరంపరను కొనసాగిస్తున్నాడు దర్శకుడు సుధీర్ వర్మ.

Sudheer Varma - ఫ్లాపుల్లో హ్యాట్రిక్ కొట్టాడు
X

వరుసగా 3 హిట్స్ కొడితే హ్యాట్రిక్ అంటారు. అలాంటి హ్యాట్రిక్ ను రావణాసుర సినిమాతో మిస్సయ్యాడు హీరో రవితేజ. అయితే ఇదే సినిమాతో దర్శకుడు సుధీర్ వర్మ మాత్రం హ్యాట్రిక్ అందుకున్నాడు. అయితే హిట్స్ లో మాత్రం కాదు.

సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కింది రావణాసుర సినిమా. రవితేజ నెగెటివ్ షేడ్స్ లో కనిపించిన ఈ సినిమాను ప్రేక్షకులు తిరస్కరించారు. మొదటి 3 రోజులకే సినిమా దుకాణం సర్దేసింది. ప్రస్తుతం ఎక్కడా ఆక్యుపెన్సీ కనిపించడం లేదు. ఈ సినిమాతో సుధీర్ వర్మకు మరో ఫ్లాప్ తప్పలేదు.

ఈ మూవీ కంటే ముందు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శాకినీ డాకినీ అనే సినిమా తీశాడు సుధీర్ వర్మ. రెజీనా, నివేత ధామస్ లీడ్ రోల్స్ లో, ఓ కొరియన్ మూవీకి రీమేక్ గా ఇది వచ్చింది. ఈ సినిమా కూడా తగిన ఫలితాన్ని అందించలేకపోయింది. రిలీజైన మొదటి రోజే సినిమా ఫ్లాప్ అయింది.

ఈ రెండు సినిమాల కంటే ముందు రణరంగం అనే మరో సినిమా తీశాడు. శర్వానంద్ హీరోగా, భారీ కాస్టింగ్ , భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది. అలా నాలుగేళ్లుగా ఫ్లాపులు తీస్తూనే ఉన్నాడు ఈ దర్శకుడు. రావణాసుర సినిమాతో ఫ్లాపుల్లో హ్యాట్రిక్ కొట్టాడు.

ప్రస్తుతం కొత్త సినిమా ఏదీ ప్రకటించలేదు ఈ దర్శకుడు. పవన్ కల్యాణ్ తో ఓ సినిమా చేస్తాడనే రూమర్ నడుస్తున్నప్పటికీ, దానిపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.

First Published:  12 April 2023 2:25 AM GMT
Next Story