Telugu Global
Cinema & Entertainment

నాగార్జున కంటే ముందు నాకే ఆఫర్ వచ్చింది

బ్రహ్మాస్త్ర సినిమాకు సుధీర్ బాబుకు ఏమైనా సంబంధం ఉందా? ఉందంటున్నాడు ఈ హీరో. అదేంటో చూద్దాం రండి.

నాగార్జున కంటే ముందు నాకే ఆఫర్ వచ్చింది
X

తెరవెనక సంగతులు భలే ఆసక్తికరంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా ఏ సినిమా ఆఫర్ ఎవరి చేజారిందనే విషయాలు ప్రేక్షకులకు చాలా ఆసక్తి కలిగిస్తాయి. ఇది కూడా అలాంటి మేటరే. బ్రహ్మాస్త్ర అనే బాలీవుడ్ సినిమాలో నాగార్జున నటించిన సంగతి తెలిసిందే. నిజానికి అది నాగార్జున చేయాల్సిన పాత్ర కాదంట. సుధీర్ బాబు చెబుతున్న ఆ ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటో మీరే చదవండి..

"బాగి తర్వాత కొన్ని ఆఫర్స్ వచ్చాయి. కానీ చేయలేదు. అందులో బ్రహ్మాస్త కూడా ఉంది. ఆ సినిమాలో ఓ రోల్ కోసం నన్ను సంప్రదించారు. కానీ ఆ సమయంలో నేను సమ్మోహనం సినిమా చేస్తున్నాను. అలాగే పుల్లెల గోపీచంద్ బియోపిక్ కూడా అప్పట్లో లైనప్ లో ఉండేది. అందుకే బ్రహ్మాస్త్ర ఆఫర్ వదులుకున్నాను"

ఇలా చాలా ఏళ్ల కిందటే తనను బ్రహ్మాస్త్ర కోసం సంప్రదించిన విషయాన్ని బయటపెట్టాడు సుధీర్ బాబు. అయితే సినిమాలో తనకు ఆఫర్ చేసిన పాత్ర ఏంటనే విషయాన్ని మాత్రం అతడు వెల్లడించలేదు. బహుశా, అది నాగార్జున చేసిన రోల్ అయి ఉంటుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

సుధీర్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ మేటర్ బయటపెట్టాడు సుధీర్ బాబు. నిన్న రిలీజైన ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది.

First Published:  17 Sep 2022 6:57 AM GMT
Next Story