Telugu Global
Cinema & Entertainment

సుధీర్ బాబు కొత్త సినిమా టైటిల్ ఇదే

భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు సుధీర్. ఈ సినిమాకు తాజాగా టైటిల్ ఫిక్స్ చేశారు. సోషల్ మీడియాలో చిన్నపాటి క్విజ్ కార్యక్రమం పెట్టి మరీ హంట్ అనే టైటిల్ ను ఎనౌన్స్ చేశారు.

సుధీర్ బాబు కొత్త సినిమా టైటిల్ ఇదే
X

సుధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వి.ఆనంద ప్రసాద్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహేష్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. పోలీస్ నేపథ్యంలో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి 'హంట్' టైటిల్ ఖరారు చేశారు.

సుధీర్ బాబు ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌ రోల్‌లో కనిపించనున్న చిత్రమిది. ఆయనతో పాటు శ్రీకాంత్, 'ప్రేమిస్తే' భరత్ పోలీస్ ఆఫీసర్లుగా చేస్తున్నారు. ఈ ముగ్గురూ క్లోజ్ ఫ్రెండ్స్. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. చాలా స్టైలిష్ ఫిల్మ్. ఇప్పటివరకు వచ్చిన సుధీర్ బాబు సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. కనిపించని శత్రువు కోసం జరిపే వేట ఈ సినిమా ప్రధాన కథాంశం.

ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో యాక్షన్ సీక్వెన్సులు చాలా సహజంగా, కొత్తగా ఉంటాయంటున్నారు మేకర్స్.

సినిమాలో శ్రీకాంత్, భరత్ తో పాటు.. మైమ్ గోపి, కబీర్ దుహన్ సింగ్, మౌనిక రెడ్డి, గోపరాజు రమణ, మంజుల, చిత్రా శుక్ల ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీత దర్శకుడు.

First Published:  29 Aug 2022 11:02 AM GMT
Next Story