Telugu Global
Cinema & Entertainment

Mama Mascheendra | మంచి డేట్ లాక్ చేసిన సుధీర్ బాబు

Mama Mascheendra - సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా మామా మశ్చీంద్ర. ఈ మూవీ విడుదల తేదీ లాక్ అయింది.

Mama Mascheendra | మంచి డేట్ లాక్ చేసిన సుధీర్ బాబు
X

నైట్రో స్టార్ సుధీర్ బాబు క్రేజీ ప్రాజెక్ట్ 'మామా మశ్చీంద్ర'. ఈ సినిమాలో అతడు త్రిపాత్రాభినయంతో అలరించబోతున్నాడు. యాక్టర్ -ఫిల్మ్ మేకర్ హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పిపై నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఇందులో దుర్గ (స్థూలకాయుడు), పరశురాం (ఓల్డ్ డాన్), డిజె.. ఇలా మూడు భిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నాడు సుధీర్ బాబు.

ఈ రోజు మేకర్స్ 'మామా మశ్చీంద్ర' రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. అక్టోబర్ 6న ఈ సినిమాని గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. రిలీజ్ డేట్ పోస్టర్ లో దుర్గ- ఓల్డ్ డాన్, డిజె.. ఈ మూడు లుక్స్ లో ఆకట్టుకున్నాడు సుధీర్ బాబు.

ఇప్పటికే ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్ సినిమా పై క్యురియాసిటీని పెంచింది. ఫస్ట్ సింగిల్ గాలుల్లోన సంగీత ప్రియులను అలరించింది. ఇప్పుడు విడుదల తేదీని కూడా ప్రకటించడంతో, ఇకపై ప్రచారం కార్యక్రమాలు పీక్ స్టేజ్ లో సాగబోతున్నాయి.

ఈ చిత్రంలో మృణాళిని రవి, ఈషా రెబ్బా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పిజి విందా సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీత దర్శకుడు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ ద్విభాషా చిత్రాన్ని అక్టోబర్ 6న విడుదల చేయబోతున్నారు.

First Published:  6 Sep 2023 5:49 PM GMT
Next Story